Wealthy Indians: హార్దిక్ పాండ్యా టు అంబానీ… లగ్జరీ SUV కార్లను వాడేది వీరే!

మన భారతీయ సెలబ్రిటీల్లో హార్దిక్ పాండ్యా నుంచి ముఖేశ్ అంబానీ వరకు ఎవరెవరూ లగ్జరీ మెర్సిడిస్ జీవాగన్ జీ 63 ఎఎంజీ SUV కార్లను వాడుతున్నారో ఓసారి చూద్దాం

Hardik Pandya To Mukesh Ambani, Wealthy Indians Who Own The Luxurious Mercedes G Wagon G63 Amg Suv

luxurious Mercedes G Wagon G63 AMG SUV : ఆకర్షణీయమైన బాక్సీ డిజైన్.. చిన్నపాటి స్కైయిర్ విండోలు, కలర్ ఫుల్ మోడల్స్‌.. అదే.. Mercedes G Wagon G63 AMG.. దేశవ్యాప్తంగా హాట్ అండ్ ఫేవరెట్ లగ్జరీ SUV కార్లలో ఇదొకటి. టాప్ క్రికెటర్ల నుంచి సినీ స్టార్స్, టాప్ బిజినెస్ మెన్ల వరకు అందరూ ఈ లగ్జరీ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవే మోడల్స్ కార్లు వాడుతూ సిటీలో చక్కర్లు కొడుతున్నారు.

రిచ్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే లగ్జరీ కార్లలో Mercedes SUV ఫేవరెట్ మోడల్. ఒక ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో Cristiano Ronaldo కూడా ఈ మెర్సిడెస్ లగ్జరీ కార్ల జాబితాలోకి చేరాడు. తన కార్ల మెర్సిడెస్‌లో Brabus G Wagon అప్ గ్రేడెడ్ వెర్షన్ కొనుగోలు చేశాడు. అలాగే మన భారతీయ సెలబ్రిటీల్లో హార్దిక్ పాండ్యా నుంచి ముఖేశ్ అంబానీ వరకు ఎవరెవరూ లగ్జరీ మెర్సిడిస్ జీవాగన్ జీ 63 ఎఎంజీ SUV కార్లను వాడుతున్నారో ఓసారి చూద్దాం..

1. హార్దిక్ పాండ్యా :
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫేవరెట్ SUV కార్ల కలెక్షన్లలో Rolls Royce కలిగి ఉన్నాడు. తన Mercedes G Wagon G63 AMG కారులో తన భార్య (Natasa Stankovic)తో కలిసి పాండ్యా డ్రైవింగ్ చేస్తూ పలుమార్లు సిటీ రోడ్లపై కనపించాడు. డిన్నర్లు, ప్రాక్టీస్ సెషన్లు కావొచ్చు.. పలు సందర్భాల్లో పాండ్యా ఈ కారులోనే వెళ్లివస్తుంటాడు.

2. సారా అలీఖాన్ :
Mercedes G-Wagon కొత్తగా కొనుగోలు చేసిన బాలీవుడ్ సెలబ్రిటీల్లో Sara Ali Khan ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యూటీ సారా.. మెర్సిడిస్ కారును కొనుగోలు చేశారు. వరుణ్ ధావన్ హౌస్ పార్టీలో pristine white మెర్సిడెస్ కారులో కనిపించారు.

3. రన్ వీర్ కపూర్ :
బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరైన Ranbir Kapoorకు కూడా Mercedes G-Wagon కారు ఉంది. ఈ కారును సిటీలో అనేకసార్లు చక్కర్లు కొడుతూ కపూర్ కనిపించాడు. కపూర్ Mercedes G-Wagon G63 AMG కారు 544bhp గరిష్టంగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 760Nm పీక్ టర్క్యూను ఉత్పత్తి చేస్తుంది.

4. ముఖేశ్ అంబానీ :
అపర కుబేరుడు, బడా వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీకి ఇలాంటి మెర్సిడెస్ లగ్జరీ కార్లు ఒకటి కాదు.. నాలుగు Mercedes G-Wagons కార్లు ఉన్నాయి. అంబానీ సెక్యూరిటీ ఫ్లీట్ లో ఈ SUV కారు కూడా ఒకటిగా ఉంది.

5. నాగ చైతన్య :
దక్షిణాది సూపర్ స్టార్ అక్కినేని నాగ చైతన్యకు కూడా Mercedes G-Wagons కారు ఉంది. చైతూ కార్ల కలెక్షన్లలో ఈ మోడల్ SUV కారు ఒకటి. హార్దిక్ పాండ్యా లగ్జరీ కారు క్రోమ్ ఫినీష్ అయితే.. చైతూ అనేక లగ్జరీ కార్ల గ్యారేజీలో ఎలక్ట్రిక్ బ్లూ ఫినీష్ ఒకటి.