HDFC TRV Rule
HDFC TRV Rule : HDFC బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే అక్టోబర్ 1 నుంచి స్పెషల్ ఇంపీరియా ప్రొగ్రామ్ (TRV) రూల్స్ మారబోతున్నాయి. ప్రీమియం ఇంపీరియా బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అర్హత ప్రమాణాలను సవరించింది. టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ (TRV) కొత్త నిబంధనను చేర్చింది. ఈ మార్పు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా తమ కస్టమర్లకు ఈ-మెయిల్ నోటిఫికేషన్లను పంపుతోంది.
కొత్త అర్హత ప్రమాణాలివే :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఆఫర్‌లలో ఇంపీరియా ప్రొగ్రామ్ ఒకటి. ఇందులో అర్హత కోసం కస్టమర్‌లు ‘గ్రూప్’ స్థాయిలో కనీసం రూ. 1 కోటి TRV కలిగి ఉంటుంది. ప్రస్తుత ప్రమాణాలకు అదనంగా ఈ కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది.
కస్టమర్, వారి కుటుంబ సభ్యులు తమ ఖాతాల్లో మొత్తం రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం, ఎవరైనా ఒక కస్టమర్ అర్హత పొందడం ద్వారా ఇంపీరియా సౌకర్యాలను పొందవచ్చు. ఈ బ్యాంక్ ఎంపిక చేసిన కస్టమర్ల కోసం అనేక ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది.
టీఆర్‌వీ (TRV) ఏంటి? :
టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ అనేది ఒక కస్టమర్, వారి అనుబంధ గ్రూపు బ్యాంకుకు అందించే మొత్తాన్ని లెక్కిస్తారు. ఇందులో డిపాజిట్లకు మించి పెట్టుబడులు, రుణాలు ఉంటాయి.
ఈ రూల్ ఏయే కస్టమర్లకు వర్తిస్తుంది? :
జూన్ 30, 2025 కి ముందు ఇంపీరియా ప్రోగ్రామ్‌లో చేరిన కస్టమర్లకు ఈ నియమం వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి వారికి కొత్త రూల్స్ ప్రారంభమవుతాయి. కానీ, జూలై 1 తర్వాత ఇంపీరియా ప్రోగ్రామ్‌లో చేరిన లేదా స్టేటస్ అప్‌గ్రేడ్ చేసినా లేదా డౌన్‌గ్రేడ్ చేసిన కస్టమర్లకు, ఈ నియమాలు ఇప్పటికే వర్తిస్తాయి. పాత నియమాలు కూడా వర్తిస్తాయి.
ఒక కస్టమర్ ప్రతి త్రైమాసికంలో కరెంట్ ఖాతాలో సగటున రూ. 15 లక్షల బ్యాలెన్స్ ఉంచినా లేదా సేవింగ్స్ అకౌంటులో సగటున నెలవారీ బ్యాలెన్స్ రూ. 10 లక్షలు, సేవింగ్స్, కరెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలలో కలిపి సగటున రూ. 30 లక్షల నెలవారీ బ్యాలెన్స్ ఉంచితే అప్పుడు కస్టమర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
సగటు నెలవారీ బ్యాలెన్స్ ఎవరైనా నెలకు రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం కలిగి ఉంటే ఇంపీరియా కార్యక్రమంలో భాగం కావచ్చు. ఎవరికైనా నెలకు రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే HDFC బ్యాంక్ కార్పొరేట్ జీతం అకౌంట్లోకి వస్తే వారు కూడా ఈ ఇంపీరియా ప్రొగ్రామ్ లో చేరవచ్చు.
ఇంపీరియా ప్రోగ్రామ్‌ను ప్రత్యేక కస్టమర్ల కోసం అందించనున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్‌లో భాగమైతే.. మీ అకౌంట్ బ్యాలెన్స్, పెట్టుబడిని చెక్ చేయండి. మీకు రూ. 1 కోటి TRV లేకపోతే పాత నిబంధనల ప్రకారం మీరు ఈ ప్రోగ్రామ్‌లో కొనసాగవచ్చు.
కస్టమర్లకు అనేక ఫ్రీ సర్వీసులు :
ఇంపీరియా ప్రోగ్రామ్ కస్టమర్లు సాధారణ ఖాతాదారులు చెల్లించాల్సిన అనేక ఉచిత సేవలను పొందుతారు. ఇందులో ఇంటర్-బ్రాంచ్ నిధుల బదిలీలు, పేమెంట్ ఆపివేయడం, చెక్ సేకరణ, ఫేక్ అకౌంట్ స్టేట్‌మెంట్, మాండేట్ రిజిస్ట్రేషన్, పాత రికార్డులను తిరిగి పొందడం, వడ్డీ, బ్యాలెన్స్ సర్టిఫికెట్లు, అడ్రస్ లేదా సైన్ వెరిఫికేషన్ ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఇంపీరియా కస్టమర్లకు ఉచితంగా పొందవచ్చు.
లాకర్ సౌకర్యం ప్రయోజనాలు :
ఒక లాకర్ వార్షిక అద్దె లేకుండా ఉచితంగా పొందవచ్చు. అదే గ్రూపులో రెండో లాకర్ కేటాయిస్తే అద్దెపై 50 శాతం తగ్గింపుతో పొందవచ్చు.