Fake Google Alerts : జీమెయిల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. అర్జంట్‌గా మీ పాస్‌వర్డ్ మార్చేయండి..!

Fake Google Alerts : జీమెయిల్ కు ఇలాంటి ఫేక్ ఈమెయిల్స్ వస్తున్నాయా? హ్యాకర్లు ఫిషింగ్ ఈమెయిల్స్ పంపుతున్నారు.. ఎలా సేఫ్ గా ఉండాలంటే?

Fake Google Alerts : జీమెయిల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. అర్జంట్‌గా మీ పాస్‌వర్డ్ మార్చేయండి..!

Fake Google Alerts

Updated On : August 27, 2025 / 5:49 PM IST

Fake Google Alerts : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? తస్మాత్ జాగ్రత్త.. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. మీకు తెలియకుండానే మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ చేసే ప్రమాదం (Fake Google Alerts) ఉంది. ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ స్కామ్స్ ఎక్కువవుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ రోజురోజకీ కొత్త పద్ధతుల్లో సైబర్ మోసాలకు తెగబడుతున్నారు.

తాజాగా మరో కొత్త సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గూగుల్ సెక్యూరిటీ వార్నింగ్ నోటిఫికేషన్ల పేరుతో కొత్త ఫిషింగ్ క్యాంపెయిన్ కు తెర లేపారు. గూగుల్ పంపినట్టుగా ఫేక్ ఈమెయిల్స్ పంపుతున్నారు. జీమెయిల్ యూజర్లు అది నిజమేనని లింక్ క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ క్రెడిన్షియల్స్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్టే. నిజానికి ఆ ఫేక్ ఇమెయిల్ నోటిఫికేషన్లు అర్జంట్ సెక్యూరిటీ అలర్ట్ లేబుల్ చేసి ఉంటాయి.

మీ అకౌంట్ ఎవరో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు.. మీ అకౌంట్ కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడే సెక్యూర్ చేసుకోండి అంటూ మెసేజ్ లింక్ కనిపిస్తుంది. తొందరపడి మీరు ఆయా లింక్స్ క్లిక్ చేస్తే మాలాసియస్ వెబ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతుంది. అలా మీ అకౌంట్ లాగిన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ దొంగిలిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల జీమెయిల్ అకౌంట్లకు హ్యాకర్ల ముప్పు ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Apple MacBook Air : స్టూడెంట్స్ కోసం అద్భుతమైన ఆపిల్ ల్యాప్‌టాప్.. ఇలా కొన్నారంటే మ్యాక్‌బుక్ ఎయిర్ అతి తక్కువ ధరకే..!

గతంలో గూగుల్ కూడా దీనికి సంబంధించి నివేదికను వెల్లడించింది. కేవలం 36 శాతం యూజర్లు మాత్రమే తమ జీమెయిల్ అకౌంట్ల పాస్ వర్డ్ తరచుగా అప్ డేట్ చేస్తున్నారని తెలిపింది. మిగతా జీమెయిల్ అకౌంట్లు అప్ డేట్ చేయకపోవడంతో హ్యాకర్ల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

Fake Google Alerts : జీమెయిల్ అకౌంట్లు సేఫ్‌గా ఉండాలంటే? :

మీకు వచ్చిన మెయిల్ నిజంగా గూగుల్ పంపిందా లేదా వెరిఫై చేసుకోవాలి. అనుమానం ఉంటే ఆయా లింక్స్ అసలు క్లిక్ చేయొద్దు. ఆ లింక్స్ క్లిక్ చేయకుండా మరో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ సెక్యూరిటీ ఇష్యూ ఏమైనా ఉందా చెక్ చేయండి.

1. జీమెయిల్ కు వచ్చిన మెయిల్ అడ్రస్ ఎక్కడిదో చెక్ చేయండి. ఫిషింగ్ ఈమెయిల్స్ సాధారణంగా ఫేక్ సెండర్ ఐడీల నుంచి వస్తుంటాయి. చూసేందుకు గూగుల్ సెక్యూరిటీ మాదిరిగా ఉంటాయి. కానీ, ఇమెయిల్ అడ్రస్ గజిబిజీగా ఉంటాయి.

2. గూగుల్ ఫిషింగ్ రిపోర్టింగ్ టూల్ ద్వారా యూజర్లు ఇలాంటి అనుమానాస్పద ఇమెయిల్స్ గురించి ఫిర్యాదు చేయొచ్చు.

3. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయండి. తద్వారా హ్యాకర్లు మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ చేయలేరు.

ఇలా అసలు చేయొద్దు :
జీమెయిల్ ద్వారా ఏదైనా అనుమానాస్పద లింక్స్ నేరుగా క్లిక్ చేయొద్దని సెక్యూరిటీ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ అకౌంట్ వివరాలతో పర్సనల్ డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. పొరపాటున కూడా మీ వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేయకూడదని గుర్తుంచుకోవాలి.