Health Insurance : మీరు ఇంకా ‘ఆరోగ్య బీమా’ తీసుకోలేదా? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే.. ఇప్పుడే అడిగి మరి తీసుకుంటారు..!
Health Insurance : మీరు ఇన్సూరెన్స్ తీసుకోలేదా? భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదు. మీ కుటుంబ భద్రతే కాదు.. పెట్టుబడితో సేవింగ్స్ కూడా చేయొచ్చు.

5 benefits of health insurance
Health Insurance : మీరు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? ఇది మీకోసమే.. ఏదైనా బీమా తీసుకోవడం ద్వారా మీ కుటుంబ భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది. ఇది తెలిసినా కూడా కూడా చాలా మంది బీమా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
ఇప్పటికీ, దేశంలోని జనాభాలో 5 శాతం నుంచి 30 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా ఉంది. అంటే.. చాలా జనాభాకు ఇప్పటికీ ఆరోగ్య బీమా లేదు. మీరు కూడా ఇప్పటికీ ఏ రకమైన బీమాను తీసుకోకపోతే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి. ఆ తర్వాత మీరే మనస్సు మార్చుకుంటారు. బీమా తీసుకుంటామని అంటారు.
రిస్క్‌తో పాటు సేవింగ్స్ పెంచుకోండి :
బీమా పథకాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా పెట్టుబడితో పాటు సేవింగ్స్ కూడా ప్రోత్సహిస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వంటి అనేక పథకాలు ఉన్నాయి. తద్వారా మీరు మంచి రాబడిని కూడా పొందవచ్చు.
మీతో మీ కుటుంబాన్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు :
ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. భవిష్యత్తులో వచ్చే నష్టాలకు రెడీగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ లేదా ప్రాణానికి సంబంధించిన రిస్క్ అయినా భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
మీకు బీమా ఉంటే.. భవిష్యత్తులో మీరు సురక్షితమైన కవర్ పొందవచ్చు. మీరు ఆరోగ్య బీమా, జీవిత బీమా, కారు బీమా మొదలైన వాటిని పొందవచ్చు. ఈ బీమాలన్నీ మీకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి.
పన్ను ఆదా చేయొచ్చు :
మీరు బీమా ద్వారా పన్నును కూడా ఆదా చేసుకోవచ్చు. దీని ద్వారా, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80C, 80D కింద ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
రిటైర్మెంట్ ప్లాన్ :
మీరు యాన్యుటీ బీమా ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాలను పొందవచ్చు. ఇందులో బీమా కంపెనీకి, మీకు మధ్య ఒక డీల్ ఉంది. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెడతారు. మీరు నిర్ణీత మొత్తంలో పెన్షన్ పొందవచ్చు.
Read Also : Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
కుటుంబానికి ఆర్థిక భద్రత :
మీరు ఆరోగ్య బీమా తీసుకుంటే.. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తును కూడా భద్రంగా కాపాడుకోవచ్చు. బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడల్లా, నామినీ లేదా కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం పొందుతారు. ఇది కాకుండా, భవిష్యత్తులో మీకు ప్రమాదం జరిగితే, మీరు బీమా ప్రయోజనాలను పొందవచ్చు.