Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Tech Tips : మీ ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. అది మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతిస్తుంది. మీ ఫోన్‌ కూడా తొందరగా పాడైపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవే..

Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

5 common mistakes we are all making when charging our mobile phones

Updated On : February 16, 2025 / 2:58 PM IST

Tech Tips : నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనేది ఏం పని జరగదు. క్షణం కూడా మొబైల్ ఫోన్ లేకుండా జీవించలేరు అంటే అతిశయోక్తి కాదు. అలా మన జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ కొనసాగే సరిపోదు. వాడకంపై కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్ ఎలా పడితే అలా ఛార్జింగ్ పెట్టకూడదు. ఇలా చేస్తుంటే మీ ఫోన్ ఏదో ఒక రోజు పనిచేయడం ఆగిపోతుంది.

Read Also : Fastag New Rules : ఫిబ్రవరి 17 నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. వాహనదారులు ఇవి తప్పక తెలుసుకోండి.. లేదంటే భారీ జరిమానా కట్టాల్సిందే..!

అంతేకాదు.. ఆ ఫోన్ బ్యాటరీ పనితీరు మందగిస్తుంది. రోజుంతా ఛార్జింగ్ రావాల్సిన ఫోన్ వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంటుంది. దీనికి ప్రధాన కారణం.. ఫోన్ ఛార్జింగ్ విషయంలో చేసే చిన్నపాటి పొరపాటే.. ఛార్జింగ్ సమయంలో చేసే ఈ పొరపాట్లు బ్యాటరీ లైఫ్ దెబ్బతీస్తాయని గుర్తించడం లేదు.

మీ ఫోన్‌ కూడా దెబ్బతింటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా, సమర్థవంతంగా ఛార్జ్ చేసేందుకు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒరిజినల్ ఛార్జర్‌నే వాడండి : ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు అందించిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌నే ఉపయోగించండి. చౌకైన లేదా లోకల్ ఛార్జర్లు ఫోన్ బ్యాటరీ, సర్క్యూట్‌లను దెబ్బతీస్తాయి.

ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ వాడొద్దు : ఛార్జింగ్ చేస్తున్నప్పుడు గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం లేదా కాల్స్‌లో మాట్లాడటం వల్ల బ్యాటరీ ఇంకా వేడెక్కుతుంది. దాంతో బ్యాటరీ త్వరగా పాడైపోయే అవకాశాలు పెరుగుతాయి. కొన్నిసార్లు అధిక వేడితో బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఓవర్ ఛార్జింగ్ చేయొద్దు : మీ ఫోన్‌ను రాత్రంతా ఛార్జ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్లలో ఆటో-కట్ ఫీచర్ ఉంది. అయినా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.

Read Also : Tech Tips : ఎక్కడ చూసినా ఫోన్ కాల్ రికార్డింగ్సే.. మీ కాల్ రికార్డ్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

హీట్ నుంచి ప్రొటెక్ట్ చేయండి : ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను సూర్యకాంతిలో లేదా వేడి ప్రదేశాలలో ఉంచవద్దు. అధిక వేడి బ్యాటరీ పనితీరుపై ప్రభావితం చేస్తుంది. అంతేకాదు.. మీ ఫోన్ భద్రతకు కూడా ముప్పు కలుగుతుంది.

బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వొద్దు : బ్యాటరీ ఫూర్తిగా జీరో శాతానికి డిశ్చార్జ్ అయ్యే ముందు ఛార్జ్ చేయడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఫోన్‌ను 20 శాతం నుంచి 80శాతం మధ్య ఛార్జ్ చేయాలి. ఇలా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు.