తక్కువ టైమ్ లోనే భారత మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ‘రెడ్‌మి 8’ పేరుతో వస్తున్న ఈ ఫోన్ బుధవారం(09 అక్టోబర్ 2019) లాంచ్ అవగా.. రెడ్‌మి 7కి అప్డేట్ వెర్షన్ గా దీనిని కంపెనీ మార్కెట్లోకి తీసుకుని వచ్చింది. ఏఐ డ్యూయల్ కెమెరాలతో 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది.
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, “ఇండస్ట్రీ-లీడింగ్” ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్ 363 సెన్సర్, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే స్పీడ్ చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్ సీ చార్జర్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిజైన్ పెద్ద డిస్‌ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది. “అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్”తో రెడ్ , బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్‌లో “ఆరా మిర్రర్ డిజైన్” తో దీన్ని ఆవిష్కరించింది. ఎంఐ .కామ్, ఎంఐ సోర్స్,ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ 16నుంచి కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది.
రెడ్‌మి 8 ఫీచర్లు:
స్నాప్ డ్రాగన్ 439 సాక్
ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9
720×1520 పిక్సెల్స్‌రిజల్యూషన్
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ ధర రూ.
512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12+ 2 ఎంపీ రియల్ డ్యుయల్ కెమెరా
8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు:
3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ రూ. 8,999(అయితే ఫస్ట్ బుకింగ్ చేసుకున్న 50లక్షల మందికి కంపెనీ ఈ ఫోన్ ను రూ. 7999కే ఇవ్వనున్నన్నట్లు ప్రకటించింది.)
బుకింగ్ అక్టోబర్ 16వ తేదీ నుంచి మొదలవుతుంది.
We have received about 64 Million queries from an infinite number of Mi fans for this. ?
Here’s announcing the launch date of this beast of a phone. #64MPQuadCamBeast is coming on 16th October 2019. Can we get 6400 RTs on this? pic.twitter.com/mcvWwfJ26l
— Redmi India for #MiFans (@RedmiIndia) October 9, 2019