Hero 160R 4V Launch : బైక్ అంటే ఇది భయ్యా.. సరికొత్త హీరో 160R 4V ఇదిగో.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

Hero 160R 4V Launch : భారత మార్కెట్లోకి Hero 160R 4V కొత్త బైక్ వచ్చేసింది.. జూన్ 15 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. జూలై రెండవ వారంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Hero 160R 4V launched in India, price starts at Rs 1,27,300

Hero 160R 4V Launch : ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్పొరేషన్ (Hero MotoCorp) భారత మార్కెట్లో సరికొత్త Hero 160R 4V బైక్ రూ. 1,27,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు జూన్ 15 నుంచి ఓపెన్ కానున్నాయి. వచ్చే జూలై రెండవ వారంలో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్పోరేషన్ ప్రకారం.. Hero 160R 4V బైక్ 12 పేటెంట్లను పొందింది. ఈ మోటార్‌సైకిల్‌ను వివిధ భూభాగాల్లో 2లక్షల కిలోమీటర్లకు పైగా పరీక్షించారు.

Read Also : YouTube Earn Money : యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ఛానల్‌కు 500 సబ్‌స్ర్కైబర్లు ఉన్నా చాలు.. ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు..!

Hero 160R 4V మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో ఉన్నాయి. వేరియంట్ వారీగా హీరో 160R 4V ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఈ కింది విధంగా ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,27,300 ఉండగా, కనెక్టెడ్ వేరియంట్ ధర రూ. 1,32,800, మూడో వేరియంట్ ప్రో మోడల్ బైక్ ధర రూ. 1,36,500 నుంచి అందుబాటులో ఉంది.

Hero 160R 4V launched in India, price starts at Rs 1,27,300

ఈ హీరో మోటార్‌సైకిల్ 163cc 4-వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 16.9PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. USD ఫోర్క్‌లను కలిగి ఉంది. అత్యంత అధునాతన టెలిమాటిక్స్‌తో భారత మార్కెట్లో అత్యంత వేగవంతమైన, తేలికైన 160cc మోటార్‌సైకిల్ అని కంపెనీ పేర్కొంది. Hero 160R 4V డైనమిక్ దూకుడుతో వస్తుంది. ఈ బైక్ హెడ్‌ల్యాంప్‌ను తగ్గించి ట్యాంక్ ప్రొఫైల్‌ పెద్దదిగా వచ్చింది. మోటార్‌సైకిల్‌లో స్ప్లిట్-సీట్, సింగిల్-సీట్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. హీరో బైకు సీటు ఎత్తు 795 మిమీ ఉండగా.. మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Infinix Note 30 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు..!