×
Ad

Hero HF Bike Prices : కొత్త బైక్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన హీరో 100CC బైకుల ధరలు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Hero HF Bike Prices : హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్ ధరలు పెరిగాయి. 100సీసీ బైక్‌ల ధరలు భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైనవిగా మారాయి. పెరిగిన బైకుల ధరలు బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లకు మాత్రమే..

Hero HF Bike Prices

  • భారీగా పెరిగిన హీరో HF డీలక్స్, ప్యాషన్ ప్లస్ ధరలు
  • హీరో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లకు మాత్రమే
  • హీరో హెచ్ఎఫ్100 ధర కూడా పెరిగింది.
  • ఇప్పుడు రూ. 59,489 (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది

Hero HF Bike Prices : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హీరో బైక్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్ ధరలు భారీగా పెరిగాయి. 100CC ఇంజిన్ కొత్త బైక్‌లు భారత మార్కెట్లో అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈ ధరల పెంపు హీరో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ధర తక్కువతో పాటు డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నగర రైడర్లు, రోజువారీ ప్రయాణాలకు హీరో బైకులు అద్భుతంగా ఉంటాయి.

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, లాజిస్టిక్స్ కంట్రోల్ కాన్సెంట్ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని హీరో మోటోకార్ప్ బైకు ధరల పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్ ధరల అమాంతం పెంచేశాయి. మీరు ఈ బైక్‌లలో ఏదైనా ఒకటి కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు దగ్గరలోని డీలర్‌షిప్‌కు వెళ్లే ముందు వేరియంట్ వారీగా ధరలను చెక్ చేసుకోండి. హీరో హెచ్ఎఫ్ బైకుల వివరాలపై ఓసారి లుక్కేయండి..

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ధరలివే :
హీరో HF డీలక్స్ కిక్-స్టార్ట్ సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్లతో పాటు వేరియంట్‌ను బట్టి డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లతో లభిస్తుంది. 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అయ్యే ఈ బైక్ కమ్యూటర్ బైక్‌గా నిలిచింది. అద్భుతమైన మైలేజ్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. హీరో హెచ్ఎఫ్ 100 ధర కూడా పెరిగింది. ఇప్పుడు రూ. 59,489 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హీరో HF డీలక్స్ వేరియంట్లు  ఎక్స్-షోరూమ్ ధర

  • హీరో HF డీలక్స్ ప్రో రూ. 69,235
  • హీరో HF డీలక్స్ i3S కాస్ట్ OBD2B రూ.67,132
  • హీరో HF డీలక్స్ కిక్ కాస్ట్ OBD2B రూ.60,542
  • హీరో HF డీలక్స్ సెల్ఫ్ కాస్ట్ OBD2B రూ.65,749
  • హీరో HF డీలక్స్ ఆల్ బ్లాక్ OBD2B రూ.56,742

హీరో ప్యాషన్ ప్లస్ లేటెస్ట్ ధర ఎంతంటే? :
హీరో ప్యాషన్ ప్లస్ ధర కూడా పెరిగింది. ప్యాషన్ ప్లస్ గతంలో మాదిరిగానే అదే 97.2cc ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ అందిస్తుంది. ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్ల ధర స్వల్పంగా పెరిగింది. దాంతో ఎక్స్-షోరూమ్ ధర కూడా పెరిగింది. రెండు మోడళ్ల ఆన్-రోడ్ ధర, రాష్ట్ర పన్నులు ఇన్సూరెన్స్ రేట్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.

హీరో ప్యాషన్ ప్లస్ వేరియంట్లు             ఎక్స్-షోరూమ్ ధర

  • హీరో ప్యాషన్ ప్లస్ డ్రమ్ బ్రేక్ OBD2B              రూ. 76,941
  • హీరో ప్యాషన్ ప్లస్ 125 మిలియన్ ఎడిషన్     రూ. 78,3

బైకుల ధరల పెంపునకు కారణాలివే? :
బైకుల ధరలు పెంచడానికి అసలు కారణం ఏంటి అనేది హీరో మోటోకార్ప్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా ఉత్పత్తి ఖర్చులు, ముడి పదార్థాలు, ఇతర ఇన్‌పుట్‌లు పెరిగితే ఆటో పరిశ్రమలో ప్రొడక్టుల ధరలు పెంచుతుంటాయి.

సేఫ్టీ, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయడంతో అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం బైకు తయారీ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. అందుకే బైకుల స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు చేయకుండా ఇప్పటికే ఉన్న మార్జిన్‌లను కొనసాగిస్తున్నాయి తయారీ కంపెనీలు.

మీరు ఏం చేయాలంటే? :
హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్ కొనే కస్టమర్లు కొత్త ఎక్స్-షోరూమ్ ఆన్-రోడ్ ధరల కోసం దగ్గరలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలి. పాత, కొత్త ధరలను చెక్ చేసుకోండి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రాబోయే నెలల్లో ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు. పాత ధరకే కొనేందుకు అవకాశం ఉంటుంది.