×
Ad

Honda Activa 125 : ఇది కదా ఆఫర్ మామ.. హోండా యాక్టివా 125పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్లు, మైలేజీ కోసమైనా ఈ స్కూటర్ కొనేసుకోవచ్చు..!

Honda Activa 125 : హోండా యాక్టివ్ 125 స్కూటర్ కొంటున్నారా? మార్కెట్లో ఈ స్కూటర్ ద్వారా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. మైలేజీ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే..

Honda Activa 125

Honda Activa 125 : కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. హోండా యాక్టివా 125 స్కూటర్ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ఈ హోండా యాక్టివా అతి చౌకైన ధరకే లభిస్తోంది. జీఎస్టీ రేటు 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు తర్వాత హోండా యాక్టివా 125 స్కూటర్ ధర రూ. 8,259 భారీగా తగ్గింది. ఈ తగ్గింపుతో యాక్టివా 125 స్కూటర్ మిడిల్ క్లాస్ వారికి అత్యంత సరసమైన ధరకే లభించనుంది.

హోండా యాక్టివా 125 స్కూటర్ కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,339 ఉండగా, అద్భుతమైన మైలేజ్ (47 కిమీ/లీ), 4.3-అంగుళాల TFT కన్సోల్ వంటి అడ్వాన్స్ ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter 125), సుజుకి యాక్సెస్ (Suzuki Access 125) వంటి పోటీదారులతో పోలిస్తే ఆకర్షణీయమైన డీల్‌ అని చెప్పొచ్చు. ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ కొత్త ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలపై ఓసారి లుక్కేయండి..

హోండా యాక్టివా 125 కొత్త ధరలు :
భారత ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల హోండా యాక్టివా 125 వివిధ వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 8,259కు నేరుగా తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత హోండా యాక్టివా 125 (STD) వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,339 నుంచి ప్రారంభమవుతుంది.

హోండా డీఎల్ఎక్స్ వేరియంట్ ఇప్పుడు సుమారు రూ. 89,739కి అందుబాటులో ఉంది. అయితే, టాప్ మోడల్ ధర రూ. 91,983కు పొందవచ్చు. అదే పండుగ సీజన్‌లో యాక్టివా అమ్మకాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. సిటీ డీలర్‌షిప్‌ను బట్టి ఆన్-రోడ్ ధరలు మారవచ్చు.

ఇంజిన్, మైలేజ్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ :

హోండా యాక్టివా 125 అద్భుతమైన ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యంత పాపులర్ స్కూటర్‌గా చెప్పొచ్చు. 123.92cc ఇంజిన్‌తో 8.4 పీఎస్ పవర్, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also : PM Kisan Yojana : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత వచ్చేస్తోంది.. ఈ తేదీ నాటికి రైతుల ఖాతాలోకి రూ. 2వేలు.. మీ పేరు ఉందో చెక్ చేసుకోండి!

ఈ ఇంజిన్ ఆటోమేటిక్ (CVT) ట్రాన్స్‌మిషన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 47 కి.మీ ఉంటుంది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఫీచర్ ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ ఆటో‌మాటిక్‌గా ఆపివేస్తుంది. తద్వారా ఫ్యూయల్ కూడా సేవ్ చేస్తుంది. ఫలితంగా ఇంధన సామర్థ్యం కూడా మరింత మెరుగుపడుతుంది.

అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్లు :
హోండా యాక్టివా 125 అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 4.3-అంగుళాల TFT కన్సోల్‌ కలిగి ఉంది. రైడర్లు హోండా రోడ్‌సింక్ యాప్‌ని ఉపయోగించి టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పొజిషన్ లాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. USB-C ఛార్జింగ్ పోర్ట్, బిగ్ గ్లోవ్ బాక్స్ 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.