Honda Elevate SUV : మారుతి, హ్యుందాయ్, కియాకు పోటీగా.. కొత్త మిడ్ సైజ్ హోండా ఎలివేట్ SUV వచ్చేస్తోంది.. ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Honda Elevate SUV : కొత్త మిడ్ సైజ్ హోండా కారు జూన్ 6న గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే ఈ SUV కారును లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫీచర్లు, ధర ఎంతంటే?

Honda Elevate mid-size SUV unveil on June 6, Hyundai Creta, Maruti Suzuki Grand

Honda Elevate SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వచ్చే జూన్ 6 వరకు ఆగండి.. గ్లోబల్ మార్కెట్లోకి ప్రముఖ హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త మిడ్ సైజ్ SUV 2023 కారు వచ్చేస్తోంది. ఇతర ఆటోమొబైల్ తయారీ కంపెనీలైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియాకు సెల్టాస్ కార్లకు పోటీగా ప్రపంచ మార్కెట్లోకి హోండా మిడ్ సైజ్ ఎలివేట్ SUV రానుంది. సెప్టెంబర్ 2022లో మాదిరిగా కొత్త మిడ్-సైజ్ SUVని 2023లో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు లాంచ్ చేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.

నివేదికల ప్రకారం.. ఈ మోడల్‌ను హోండా ఎలివేట్ (Honda Elevate SUV) అని పిలుస్తారు. జపనీస్ కార్ల తయారీ సంస్థ వచ్చే నెల మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలివేట్ SUV కారును ఆవిష్కరించనుంది. భారతీయ విభాగంలో ప్రస్తుతం అమేజ్, ఫిఫ్త్-జెన్ సిటీ అనే రెండు కారు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. మార్చిలో WR-V, జాజ్, నాల్గో-జనరేషన్ సిటీని నిలిపివేసింది. ఎలివేట్ SUV హోండాకు మూడో వాల్యూమ్ పిల్లర్‌గా ఉంటుంది.

Read Also : Amazon Great Summer : ఈ రాత్రి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ముందుగా వారికే.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

హోండా ఎలివేట్ మిడ్-సైజ్ SUV విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి వాటికి పోటీగా ఉంటుంది. భారత మార్కెట్లో హోండా ఎలివేట్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే.. హోండా ఎలివేట్ బోల్డ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లతో నిటారుగా ముందు భాగంలో ఉంటుంది. LED టెయిల్‌ల్యాంప్‌లు కూడా ఉంటాయి.

Honda Elevate mid-size SUV unveil on June 6, Hyundai Creta, Maruti Suzuki Grand

17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉండవచ్చు. క్యాబిన్ లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. SUV అడ్వాన్సడ్ డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS)ను కలిగి ఉంటుంది. హోండా ఎలివేట్ హోండా సిటీతో పవర్‌ట్రెయిన్‌లను షేర్ చేయొచ్చు.

ప్రముఖ సెడాన్ 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. గరిష్టంగా 121PS శక్తి, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVTతో ఉండవచ్చు. సెడాన్‌లో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంది. సిటీ e:HEV హైబ్రిడ్ ఆటో-ఛార్జింగ్, 1.5-లీటర్ అట్కిన్సన్-సైకిల్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌కు ఇంటిగ్రేట్ చేసిన రెండు-మోటార్ e-CVT సిస్టమ్‌తో వస్తుంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ 126PS గరిష్ట శక్తిని, 253Nm గరిష్ట మోటార్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also : Best Smartphones 2023 : ఈ నెలలో రూ.25వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!