Honda PCX 160 : యమహా ఏరోక్స్ 155కు పోటీగా కొత్త హోండా PCX 160 స్కూటర్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు, డిజైన్ అదుర్స్..!

Honda PCX 160 : భారత మార్కెట్లో హోండా వేరియో 160, CG160 స్టార్ట్, స్టైలో 160 వంటి ఇతర 160cc మ్యాక్సీ స్కూటర్లకు పేటెంట్ ఇచ్చింది. కానీ, అందులో ఏది కూడా ఇంకా లాంచ్ కాలేదు.

Honda PCX 160

Honda PCX 160 : కొత్త స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా (HMSI) నుంచి సరికొత్త హోండా స్కూటర్ వచ్చేస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద టూవీలర్ తయారీదారు వైడ్ రేంజ్ స్కూటర్లు, బైకులను కలిగి ఉంది. భారతీయ టూవీలర్ మార్కెట్ క్రమంగా ప్రీమియం వాహనాలతో OEM వంటి మరిన్ని ప్రీమియం మోడళ్లను అభివృద్ధి చేయడంపైనే దృష్టిసారిస్తున్నాయి.

Read Also : Vivo V50e 5G : వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

హోండా కూడా బిగ్ వింగ్ రేంజ్‌లో ప్రీమియం టూవీలర్లపై దృష్టిపెడుతోంది. ముఖ్యంగా బైకుల తయారీపై ఫోకస్ పెడుతోంది. జపనీస్ ఆటో దిగ్గజం ఇప్పుడు ప్రీమియం టూవీలర్ రేంజ్‌లో కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

కంపెనీ భారత మార్కెట్లో PCX 160 స్కూటర్ కోసం పేటెంట్లను దాఖలు చేసింది. యమహా ఏరోక్స్, అప్రిలియా SXR 160 ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన హీరో జూమ్ 160 (Hero Xoom 160) వంటి స్కూటర్లకు పోటీగా రానుంది.

హోండా PCX 160 డిజైన్ :
హోండా PCX 160 భారత మార్కెట్లోకి పేటెంట్ కంపెనీ ఆసక్తిగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇతర పోటీదారుల మాదిరిగానే PCX 160 ట్రెడెషనల్ స్కూటర్ ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌కు బదులుగా వైడ్ రేంజ్ ఫ్రంట్ ఆప్రాన్ బిగ్ సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ టన్నెల్‌తో మ్యాక్సీ-స్టయిల్ డిజైన్‌ను పొందుతుంది.

ఫ్రంట్ ఆప్రాన్‌లో బిగ్ ట్విన్-LED హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో పాటు V-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్ కూడా స్కూటర్‌కు ముందు ఉంటుంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ లాంగ్ అడ్జెస్ట్ చేయగల విండ్‌స్క్రీన్‌తో హెడ్‌లైన్ ఉంటుంది. స్టెప్-అప్ పిలియన్ సెగ్మెంట్‌తో సింగిల్-పీస్‌ను కలిగి ఉంటుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హోండా PCX 160 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హోండా ఎల్ఈడీ లైటింగ్, వైడ్ అండర్ సీట్ స్టోరేజ్, కీలెస్ ఇగ్నిషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు PCX 160తో వస్తుందని భావిస్తున్నారు. పేటెంట్ ఇమేజ్ అడ్జెస్ట్ చేయగల క్లచ్, బ్రేక్ లివర్లను కూడా ఉండవచ్చు. హార్డ్‌వేర్ పరంగా, PCX 160 అండర్‌బోన్ ఫ్రేమ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లపై సస్పెండ్ ఉంటుంది.

Read Also : Poco C71 Price : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,999కే పోకో C71 ఫోన్.. ఫ్రీగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఈ మ్యాక్సీ స్కూటర్ 14-అంగుళాల ఫ్రంట్, 13-అంగుళాల బ్యాక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. బ్రేకింగ్ కోసం రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS సాయంతో PCX160కి పవర్ అందించే 157cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంది. 8,500rpm వద్ద 15.8bhp, 6,500rpm వద్ద 14.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.