Poco C71 Price : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,999కే పోకో C71 ఫోన్.. ఫ్రీగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Poco C71 Price : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌తో పోకో C71 ఫోన్ ఏప్రిల్ 10న అమ్మకానికి వస్తుంది. ఎయిర్‌టెల్-పోకో భాగస్వామ్యంతో ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Poco C71 with Airtel Prepaid connection
Poco C71 Price : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పోకో C71 కేవలం రూ. 5,999కే కొనేసుకోవచ్చు. ఈ పోకో C71 ఫోన్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌తో వస్తుంది. ఏప్రిల్ 10న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ స్పెషల్ ఆఫర్. ఎయిర్‌టెల్-పోకో భాగస్వామ్యంతో అందిస్తోంది.
మీరు ఈ ఆఫర్ వద్దనుకుంటే.. బేస్ వెర్షన్ (4GB + 64GB) ధర రూ. 6,499కు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, 6GB + 128GB ధర రూ. 7499కు లభిస్తోంది. మీరు ప్రీపెయిడ్ కనెక్షన్‌తో 4G ఫోన్ కావాలనుకుంటే ఈ ఆఫర్ బెస్ట్. ఈ స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌టెల్ వేరియంట్ కొనుగోలుదారు ఎంచుకునే బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్‌తో పాటు అదనంగా 50GB డేటాను పొందవచ్చు.
Poco C71 స్పెసిఫికేషన్లు :
పోకో C71 యూనిసోక్ T7250 మ్యాక్స్ SoC ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 6GB వరకు ర్యామ్, 128GB వరకు ఆన్-బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. పోకో C71 బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. కంపెనీ రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తో పాటు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.88” 120Hz HD+ LCD డిస్‌ప్లేను 600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో అందిస్తుంది.
ఈ పోకో ఫోన్ వెట్ టచ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. పోకో C71 ఫోన్ 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా 32MP సెన్సార్ కలిగి ఉంది. అసిస్టెంట్ యూనిట్ కూడా ఉంది. ఈ పోకో ఫోన్ IP52 రేటింగ్, 5200mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 15W ఛార్జింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. పోకో C71 కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్, పవర్ బ్లాక్ వంటి మల్టీ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB, 6GB + 128GB ఆప్షన్లతో వస్తుంది.
ఎయిర్‌టెల్ వెర్షన్ ధర ఎంతంటే? :
పోకో C71 ఎయిర్‌టెల్ వెర్షన్ ధర రూ.5,999కు లభిస్తోంది. ఈ వెర్షన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు 50GB అదనపు డేటా వస్తుంది. ఈ వెర్షన్ ఎయిర్‌టెల్ సిమ్ లాక్ అయి ఉంటుంది. ఇందులో ఎయిర్‌టెల్ సిమ్ మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట.
పోకో C71 ఫోన్ (రెగ్యులర్ వేరియంట్) ధర 4GB + 64GB వేరియంట్‌కు రూ. 6,499, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499కు లభ్యమవుతున్నాయి. ఈ ఫోన్ల సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమైంది. ఈ వెర్షన్‌లో మీరు ఏ టెలికాం కంపెనీ సిమ్‌ను అయినా వాడొచ్చు.