SIP Investment : SIPలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ.. ఇలా చేస్తే 21 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. ఈ ట్రిక్ అందరూ చెప్పరు!

SIP Investment : SIPలో పెట్టుబడితో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. SIP కోసం పెద్దగా డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 500తో కూడా ప్రారంభించవచ్చు. పెట్టుబడి ఎంతగా ఉంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు.

SIP Investment : SIPలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ.. ఇలా చేస్తే 21 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. ఈ ట్రిక్ అందరూ చెప్పరు!

SIP Investment

Updated On : April 10, 2025 / 1:39 PM IST

SIP Investment : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామంది దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్నారు? అందులో ప్రధానంగా SIP వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి రాబడితో పాటు సురక్షితమైన విధానమే ఇందుకు కారణం.

Read Also : iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ భయ్యా.. ఇలా చేస్తే.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీ సొంతం..!

SIP అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్.. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ, మార్కెట్ లింక్ అయి ఉంటుంది. కానీ, రిస్క్ చాలా తక్కువ. వాస్తవానికి.. షేర్లలో నేరుగా డబ్బు పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే.. SIPలో రాబడి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటున 12 శాతం రాబడిని ఇస్తుంది.

ఇతర పథకాలలో ఈ బెనిఫిట్ అందుబాటులో లేదు. SIP ప్రారంభించడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు. మీరు కేవలం రూ. 500తో కూడా SIP వేయొచ్చు. మీ పెట్టుబడి ఎంత మెరుగ్గా ఉంటే.. భవిష్యత్తులో మీ సంపాదన అంతగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎస్ఐ ప్రారంభించే ముందు ఈ ట్రిక్ తెలుసుకుంటే దీర్ఘకాలంలో కోటీశ్వరుడు అవ్వొచ్చు కూడా.

SIPలో రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు :
కానీ, SIPలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటగా, మీరు ప్రతి నెలా ఒకే వాయిదాను చెల్లించాలి. రెగ్యులర్ SIPలో పెట్టుబడి పెట్టొచ్చు. మరొక మార్గం ఏమిటంటే.. మీరు ఎప్పటికప్పుడు టాప్-అప్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల SIP రాబడి మరింత పెరుగుతుంది.

SIP టాప్-అప్ చేస్తే మీరు త్వరలోనే మీరు కోటీశ్వరుడు అయిపోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు రూ. 5వేలు రెగ్యులర్ SIPని ప్రారంభించి 21 ఏళ్లు కొనసాగిస్తే మీరు మొత్తం రూ.12లక్షల 60వేలు పెట్టుబడి పెడతారు. అప్పుడు 12 శాతం రాబడి ప్రకారం లెక్కిస్తే.. మీకు వడ్డీగా రూ. 39,55,034 లభిస్తుంది. దాంతో మీరు 21 ఏళ్లలో మొత్తం ₹52,15,034 పొందుతారు.

టాప్-అప్ SIP మ్యాజిక్ ఇదే :
మీరు రూ. 5వేలు SIP ప్రారంభిస్తే.. ప్రతి ఏడాదిలో 10 శాతంతో టాప్ అప్ చేస్తూ వెళ్లాలి. మీరు 21 ఏళ్లలో రూ.1 కోటి సులభంగా కూడబెట్టుకోవచ్చు. టాప్-అప్ SIP అనేది మీ రెగ్యులర్ SIPకి కొంత మొత్తాన్ని పెంచుకోవచ్చు అనమాట.

ఉదాహరణకు.. మీరు నెలవారీ SIPని రూ. 5వేలతో ప్రారంభించారని అనుకుందాం. ఆపై ఒక ఏడాది తర్వాత రూ. 5వేలలో 10 శాతం అంటే.. రూ. 500 పెంచాలి. ఇప్పుడు మీ SIP రూ. 5,500 అవుతుంది. ఇందులో, వచ్చే ఏడాది మీరు రూ. 5,500లో 10 శాతం అంటే రూ. 550 పెంచాలి.

ఇలాంటి సందర్భాల్లో మీ SIP రూ. 6,050 అవుతుంది. అదేవిధంగా, మీరు ప్రతి ఏడాది ప్రస్తుత SIP మొత్తంలో 10 శాతం యాడ్ చేయాలి. అలా, మీరు రూ.5వేలతో SIP మొదలుపెట్టి.. ప్రతి ఏటా 10శాతం టాప్-అప్ పెంచితే మీరు 21 ఏళ్లలో మొత్తం రూ.38,40,150 పెట్టుబడి పెడతారు.

Read Also : Vivo V50e 5G : వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

కానీ, 12 శాతం అంచనా రాబడితో వడ్డీ రూ. 70,22,858 అవుతుంది. అప్పుడు, మీకు 21 ఏళ్లలో రూ.1,08,63,008 ఉంటుంది. మీరు రూ. 5వేల రెగ్యులర్ SIPతో వార్షికంగా 10 శాతం టాప్-అప్‌‌పై రెట్టింపు డబ్బు సంపాదించవచ్చు.

Disclaimer : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం మంచిది.