iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ భయ్యా.. ఇలా చేస్తే.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీ సొంతం..!
iPhone 16 Pro Max : ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరతో లభ్యమవుతుంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max Price : కొత్త ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనాలని చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ఇప్పుడు ఆపిల్ హై-ఎండ్ ఐఫోన్‌పై రూ. 15,700 భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.
ఈ డీల్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఎలా పొందాలి? ఏయే మార్గాల్లో ఆపిల్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు అనే పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రూ.1,33,700కు అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ రూ.11,200 ధర తగ్గింపును అందిస్తోంది.
ఈ ఐఫోన్ ధర మరింత తగ్గాలంటే బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల (LTPO) సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ (OLED) డిస్‌ప్లేను 2868 x 1320 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ఐఫోన్ ఆపిల్ A18 ప్రో చిప్‌తో అమర్చి ఉంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
Read Also : iQOO 12 5G Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అమెజాన్‌లో ఈ ఐక్యూ 12 5Gపై భారీ డిస్కౌంట్.. ఇంకా తగ్గాలంటే?
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్ ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4685mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.