BSNL Offers : జియో, ఎయిర్‌‍టెల్‌కు పోటీగా BSNL సూపర్ ప్లాన్.. 180 రోజుల వ్యాలిడిటీ, 90GB హై-స్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్..!

BSNL Offers : జియో, ఎయిర్‌టెల్ 98 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు BSNL పోటీగా సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు 180 రోజుల పాటు 90GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీగా అందిస్తోంది.

BSNL Offers : జియో, ఎయిర్‌‍టెల్‌కు పోటీగా BSNL సూపర్ ప్లాన్.. 180 రోజుల వ్యాలిడిటీ, 90GB హై-స్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్..!

BSNL

Updated On : April 10, 2025 / 11:29 AM IST

BSNL Offers : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా BSNL చీపెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తమ వినియోగదారుల కోసం పాకెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 6 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ టైమ్ రీఛార్జ్ ఆప్షన్లను ఇష్టపడే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎక్స్‌టెండెడ్ వ్యాలిడిటీ ప్లాన్లలకు డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో BSNL కోట్లాది మంది వినియోగదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తోంది.

Read Also : Apple iPhones : ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఆపిల్ ఫోన్ ధర రూ. 3 లక్షలపైనే..? ఎందుకో తెలిస్తే షాకవుతారు!

రూ. 897కు 180 రోజుల వ్యాలిడిటీ :
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.897 ఉంటుంది. 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే.. రోజుకు రూ.5 కన్నా తక్కువ అనమాట. ఢిల్లీ, ముంబైలోని MTNL నెట్‌వర్క్‌లో కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ ఇన్‌కమింగ్, రోమింగ్ ఉన్నాయి.

వినియోగదారులు మొత్తం వ్యాలిడిటీకి రోజుకు 100 ఫ్రీ SMS, 90GB హై-స్పీడ్ డేటాను కూడా పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ లేదు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా డేటాను వినియోగించుకోవచ్చు. హై-స్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఈ ప్లాన్ డేటా 40kbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను యాక్సస్ చేయొచ్చు.

BiTV, OTT యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ :
సాధారణ బెనిఫిట్స్‌తో పాటు BSNL వినియోగదారులు 450కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను కలిగిన BiTVకి ఫ్రీ యాక్సెస్‌ను పొందవచ్చు. అంతేకాకుండా మల్టీ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. బడ్జెట్ ఆప్షన్ల కోసం చూస్తున్న ఎంటర్‌టైన్మెంట్ ప్రియులకు ఈ ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

BSNL 4G, 5G విస్తరణకు ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ జూన్ 2025లో 5G విస్తరణకు సిద్ధమవుతోంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే 1 లక్ష ప్లాన్ చేసిన 4G టవర్లలో 81వేలు ఏర్పాటు చేసింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో, వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే 180 రోజుల ప్లాన్‌ను అందిస్తుంది.

Read Also : Google Pixel 8 Sale : ఐఫోన్ కన్నా బెటర్ బ్రో.. రూ.83 వేల గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ జస్ట్ రూ.23,500 మాత్రమే.. డోంట్ మిస్..!

జియో, ఎయిర్‌టెల్ 98 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తున్నాయి. కానీ, ఈ ధర పరిధిలో 6 నెలల ఆప్షన్ లేదు. బడ్జెట్ ధరకు లాంగ్ టైమ్ బెనిఫిట్స్ కోరుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL ఈ అదిరే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.