Apple iPhones : ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఆపిల్ ఫోన్ ధర రూ. 3 లక్షలపైనే..? ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Apple iPhones : ఆపిల్ ఐఫోన్‌లను పూర్తిగా అమెరికాలో తయారు చేస్తే.. ధర 3,500 డాలర్లు (రూ. 3 లక్షలు) వరకు పెరగవచ్చు. ప్రస్తుత తయారీ ఖర్చు కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఐఫోన్ ప్రియులు అన్ని డబ్బులు పెట్టి కొనడం కష్టమేనని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Apple iPhones : ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఆపిల్ ఫోన్ ధర రూ. 3 లక్షలపైనే..? ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Apple iPhones

Updated On : April 10, 2025 / 11:17 AM IST

Apple iPhones : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో బ్యాడ్ న్యూస్.. ఐఫోన్ ధర ఏకంగా 3 రెట్లు పెరగనుంది. అంటే.. దాదాపు రూ. 3లక్షలపైనే పెరగనుంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఇతర దేశాల వస్తువులపై సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ దెబ్బకు ఆపిల్ ఐఫోన్ ధరలు భారీగా పెరగనున్నాయి. ట్రంప్ టారిఫ్స్ పెంపు కారణంగా ఐఫోన్ మరింత ఖరీదైనదిగా మారనుందని టెక్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.

Read Also : iPhone Discounts : ఐఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఈ 3 కొత్త ఐఫోన్లు.. లిమిటెడ్ ఆఫర్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

ఐఫోన్ ధర రూ.3లక్షలపైనే చేరుకోవచ్చు :
నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్‌లను పూర్తిగా అమెరికాలో తయారు చేస్తే.. ప్రతి ఐఫోన్ ధర దాదాపు 3,500 డాలర్లు (రూ. 3 లక్షలు) పైగా పెరగవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ ధర దాదాపు వెయ్యి డాలర్లు (రూ.86వేలు) ఉంటుంది. అమెరికాలో అధునాతన ప్లాంట్లను నిర్మించడం వల్ల ఈ భారీ ధర ఉండే అవకాశం ఉంది.

ఇప్పటివరకు, ఎక్కువ ఐఫోన్‌లు చైనాలోనే తయారయ్యాయి. అక్కడ తయారీ ఖర్చులు చాలా చౌకగా ఉంటాయి. అమెరికాలో అదే ఐఫోన్‌లను ఉత్పత్తి చేయడం అంటే.. ఆపిల్ కొత్త ప్లాంట్లను నిర్మించుకోవాలి. ఇందుకోసం ఆపిల్ కంపెనీ బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఆసియాలో ఇలాంటి తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెక్ దిగ్గజానికి దశాబ్దాలు పట్టింది.

ఆసియాపైనే ఆధారపడిన ఆపిల్ :
ఐఫోన్‌ను తయారు చేసే స్పేర్ పార్ట్స్ అనేక దేశాల నుంచి వస్తాయి. ఉదాహరణకు.. చిప్‌లు ప్రధానంగా తైవాన్‌లో తయారవుతాయి. స్క్రీన్‌లు దక్షిణ కొరియా నుంచి వస్తాయి. ఇతర ఐఫోన్ పార్ట్స్ చైనాలో ఉత్పత్తి అవుతాయి.

ఐఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా రవాణా చేసే ముందు ఈ భాగాలన్నీ చైనా ఫ్యాక్టరీల్లో అసెంబుల్ చేస్తారు. ఈ దేశాలపై అమెరికా విధించిన భారీ సుంకాలు, ట్రేడ్ వార్ కారణంగా ఐఫోన్ ధరలు భారీగా ప్రభావితమవుతాయి. ట్రంప్ టారిఫ్ విధానంతో ఆపిల్ షేర్లు ఇప్పటికే 25 శాతం పడిపోయాయి.

ఆపిల్ బిజినెస్‌పై టారిఫ్స్ ఎఫెక్ట్ :
కొత్త టారిఫ్‌లు ప్రకటించినప్పటి నుంచి ఆపిల్ స్టాక్ ధర దాదాపు 25 శాతం మేర తగ్గింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆపిల్ చూస్తోంది. ఆపిల్ ప్రొడక్టులను ఉత్పత్తి చేయడానికి ప్రత్యామ్నాయ దేశాల కోసం చూస్తోంది. తక్కువ సుంకాలు ఉన్న భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లోనే ఆపిల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది.

Read Also : iPhone 16 Pro : ఈ కొత్త ఆపిల్ ఐఫోన్ చాలా చీప్ గురూ.. తక్కువ ధరకే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్..!

ఆపిల్ తయారీని అమెరికాకు మార్చకపోయినా, ఐఫోన్ ధరలు ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే.. ఎక్కువ సుంకాలు స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకునే విషయంలో భారీ ఖర్చును పెంచుతాయి. ఆపిల్ యూజర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తే.. రాబోయే కొత్త ఐఫోన్ మోడళ్ల ధర 43శాతం వరకు పెరగవచ్చు. ఈ అంతర్జాతీయ సరఫరా గొలుసు ఆపిల్ ఖర్చులను తగ్గించుకుని అధిక లాభాలను పొందవచ్చు.