iPhone Discounts : ఐఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఈ 3 కొత్త ఐఫోన్లు.. లిమిటెడ్ ఆఫర్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!
iPhone Discounts : ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ (iNvent) బిగ్ డీల్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 Plus మోడళ్లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే ఈ ఐఫోన్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

iPhone Discounts
iPhone Discounts : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు ధరతో మూడు ఆపిల్ ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే మీకు సరైన అవకాశం.
ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ (iNvent) ప్రత్యేకించి బిగ్ డీల్ డేస్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15,ఐఫోన్ 16, ఐఫోన్ 16 మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏప్రిల్ 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో ఐఫోన్ ప్రీమియం మోడళ్లను అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధర :
2023లో ఐఫోన్ 15 మోడల్ రూ.79,900కి లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు ఈ ఐఫోన్ మోడల్ కొనుగోలుపై రూ.17వేల డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి ధర రూ.62,900కి తగ్గింది. మీరు ICICI, Kotak లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా రూ.3వేలు తగ్గింపును పొందవచ్చు.
దాంతో ఐఫోన్ 15 ధర కేవలం రూ.59,900కి వస్తుంది. ఐఫోన్ 15లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ నాచ్ ఉన్నాయి. A16 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ తో 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ USB-C ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డిస్కౌంట్లు :
కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16 ధర అసలు ధర రూ.79,900 ఉండగా, ఇప్పుడు (iNvent)లో రూ.9,400 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.70,500కి కొనుగోలు చేయొచ్చు. అలాగే, బ్యాంక్ ఆఫర్లతో ధర రూ.66,500కి మరింత తగ్గుతుంది. అతిపెద్ద ఐఫోన్ 16 ప్లస్ అసలు ధర రూ.89,900 వద్ద లాంచ్ కాగా, ఇప్పుడు రూ.80,500 ధరకు అమ్ముడవుతోంది. అదే ఐఫోన్ రూ.4వేల బ్యాంక్ ఆఫర్‌తో రూ.76,500కి మరింత తగ్గింది.
Read Also : iPhone 16 Pro : ఈ కొత్త ఆపిల్ ఐఫోన్ చాలా చీప్ గురూ.. తక్కువ ధరకే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్..!
ఐఫోన్ 16, 16 ప్లస్ రెండూ పవర్‌ఫుల్ A18 చిప్‌ను కలిగి ఉన్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, హై-ఎండ్ గేమింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. అయితే, ఐఫోన్ ప్లస్ మోడల్ 6.7 అంగుళాల వరకు విస్తరించింది. రెండూ మెరుగైన షూటింగ్ కంట్రోల్ కోసం కొత్త కెమెరా కంట్రోల్ బటన్, కెమెరా ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో వస్తాయి.