Samsung Galaxy A36 5G : అదిరిపోయే డిస్కౌంట్.. భారీగా తగ్గిన శాంసంగ్ 5G ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Samsung Galaxy A36 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ ధర తగ్గింది. ఈ 5జీ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

Samsung Galaxy A36 5G
Samsung Galaxy A36 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇటీవలే మార్చిలో శాంసంగ్ గెలాక్సీ A36 5G లాంచ్ చేసింది. లాంచ్ అయిన నెలకే కంపెనీ ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ధరను తగ్గించింది.
శాంసంగ్ లేటెస్ట్ మోడళ్లలో శాంసంగ్ గెలాక్సీ A36 మోడల్ ధర తగ్గింపు పొంది. మల్టీ టాస్క్ కోసం మాత్రమే కాదు.. గేమింగ్ వంటి టాస్కులను కూడా వేగంగా పూర్తి చేయొచ్చు. మీరు మల్టీస్పెషల్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ శాంసంగ్ 5జీ ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A36 5G ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. 128GB స్టోరేజ్‌తో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో 12GB ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రతి వేరియంట్ ధర రూ. 2వేలు తగ్గింది. మీరు ఇప్పుడు 8GB ర్యామ్ + 128GB వేరియంట్‌ను రూ. 30,999కు, 8GB ర్యామ్ + 256GB మోడల్‌ను రూ. 33,999కు, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్‌ను రూ. 36,999కు పొందవచ్చు.
లాంచ్ సమయంలో శాంసంగ్ బేస్ మోడల్ రూ.32,999 నుంచి ప్రారంభమైంది. హై స్టోరేజ్ ఆప్షన్ల ధర వరుసగా రూ.35,999, రూ.38,999కు పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ అవెసమ్ బ్లాక్, అవెసమ్ లావెండర్, అవెసమ్ వైట్ అనే ఆకర్షణీయమైన మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A36 5G మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A36 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కలిగి ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 15పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఈ 5జీ ఫోన్ 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై 29 గంటల వరకు వినియోగాన్ని అందిస్తుంది. అలాగే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.