Vivo V50e 5G : వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Vivo V50e 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో V50e 5G ఫోన్ లాంచ్ అయింది. భారత్‌‌లో ఈ 5G ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, ఫీచర్లు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Vivo V50e 5G : వావ్.. వండర్‌ఫుల్.. వివో V50e 5G ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Vivo V50e 5G

Updated On : April 10, 2025 / 12:51 PM IST

Vivo V50e 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి వివో V50e 5G ఫోన్ వచ్చేసింది. వివో ఇండియా అధికారికంగా ఈరోజు (ఏప్రిల్ 10న) లాంచ్ చేసింది. ముందున్న వివో V40e కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్‌ ఫీచర్లను కలిగి ఉంది.

వివో V50 సిరీస్‌లో ఈ వివో ఫోన్ డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా, డిజైన్, బ్యాటరీ లైఫ్‌లో భారీ అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది. మెరుగైన డస్ట్, వాటర్ నిరోధకతకు IP68, IP69 రేటింగ్‌లను కూడా కలిగి ఉంది. మిడ్ రేంజ్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ కొత్త వివో V50e 5G ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : BSNL Offers : జియో, ఎయిర్‌‍టెల్‌కు పోటీగా BSNL సూపర్ ప్లాన్.. 180 రోజుల వ్యాలిడిటీ, 90GB హై-స్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్..!

వివో V50e 5G స్పెసిఫికేషన్లు :
వివో V50e 5G ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1800 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్కాట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ ఫోన్ మాలి G615 జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

8GB (LPDDR4X) ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది. 5,600mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందవచ్చు.

కెమెరాల విషయానికొస్తే.. :
వివో V50e 5G ఫోన్ కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. 50MP సోనీ IMX882 ప్రైమరీ షూటర్, OISతో పాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ స్మార్ట్‌ఫోన్ 4K రికార్డింగ్‌తో 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.

ఈ ఫోన్ బ్లూటూత్ 5.4, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరిన్నింటిని అందిస్తుంది. ఈ ఫోన్ మ్యాజిక్ ఎరేజర్, నోట్ అసిస్ట్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్, సర్కిల్ టు సెర్చ్ మరిన్నింటితో సహా అనేక రకాల ఏఐ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

Read Also : iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ భయ్యా.. ఇలా చేస్తే.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీ సొంతం..!

భారత్‌లో వివో V50e 5G ధర, లభ్యత :
వివో V50e 5G ఫోన్ 8GB, 128GB స్టోరేజ్ ధర రూ.28,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8GB, 256GB స్టోరేజ్ ధర రూ.30,999కు లభ్యమవుతుంది. ఏప్రిల్ 17 నుంచి అమ్మకానికి రానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు 10శాతం వరకు బ్యాంక్ ఆఫర్లు, 10శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. Flipkart, Vivo స్టోర్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ వివో కొత్త 5జీ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.