Honda SP125 2023 Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Honda SP125 2023 Launch : కొత్త బైక్ కొంటున్నారా? అయితే, హోండా కంపెనీ నుంచి సరికొత్త హోండా SP125 2023 మోడల్ బైక్ వచ్చేసింది. డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

Honda SP125 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Scooter) నుంచి హోండా SP125 2023 కొత్త బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ ధర భారత మార్కెట్లో రూ. 85,131 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కు అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది.

అవుట్‌గోయింగ్ మోడల్‌పై రూ. 927 ప్రీమియాన్ని అందిస్తుంది. ఈ కొత్త మోటార్ సైకిల్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. వేరియంట్ వారీగా చూస్తే.. హోండా SP125 2023 బైక్ ఇలా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). డ్రమ్ వేరియంట్ ధర రూ. 85,131గా ఉంటే.. డిస్క్ మోడల్ ధర రూ. 89,131కు అందుబాటులో ఉంది.

Read Also : iPhone 14 Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై అదిరే సేల్.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

హోండా SP125 2023 మోడల్ బైక్.. 125cc PGM-FI ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 10.88PS శక్తిని, 10.9Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. అంతేకాదు.. డైమండ్-టైప్ ఫ్రేమ్ ఆధారంగా బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో 5-దశల ఎడ్జెస్ట్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.

Honda SP125 2023 launched in India, price starts at Rs 85,131

ముందు భాగంలో 240mm డ్రమ్ లేదా 130mm డిస్క్ ఉంటుంది. వెనుక 130mm డ్రమ్ కలిగి ఉంది. 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో వచ్చింది. ఈ మోటార్‌సైకిల్ ప్రముఖ ఫీచర్లలో LED DC హెడ్‌ల్యాంప్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్ ఈక్వలైజర్‌తో కాంబి-బ్రేక్ సిస్టమ్ ఉన్నాయి.

హోండా SP125 2023 బైక్ మొత్తం బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. SP125 కాకుండా.. హోండా యాక్టివా రేంజ్ స్కూటర్‌లను H’ness CB350, CB350RS మోటార్‌సైకిళ్లను BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఈ ఏడాది దీపావళికి ముందు కంపెనీ 3 కొత్త ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్ (ICE) మోడళ్లను లాంచ్ చేయనుంది. FY24లో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) ప్రవేశపెట్టనుంది.

Read Also : Best Upcoming Smartphones : ఏప్రిల్ 2023లో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే మోడల్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు