PM Kisan Maandhan Yojana : రైతులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.36,000 పింఛను.. ఈ అర్హత ఉంటే వెంటనే అప్లయ్ చేయండి..!
PM Kisan Maandhan Yojana : నెలకు కేవలం రూ. 55 ఆదా ద్వారా వృద్ధాప్యంలో నెలకు రూ. 3వేలు గ్యారెంటీ పెన్షన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మాంధన్ యోజన పథకంలో మీ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగంటే?
PM Kisan Maandhan Yojana
- పీఎం కిసాన్ రైతులకు ఏడాదికి రూ. 36వేలు సంపాదన
- అర్హత ఉన్న రైతులకు నెలకు రూ. 3వేలు ఫించను
- ఈ పథకంలో చేరాలంటే రైతులు ఏం చేయాలంటే?
PM Kisan Maandhan Yojana : రైతులకు బిగ్ అలర్ట్.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాంధన్ యోజన (PM-KMY) పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు సామాజిక, ఆర్థిక భద్రతతో పాటు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టేసరికి ఆర్థిక సాయం అందిస్తోంది. మీరు రైతు అయితే.. చిన్న పెట్టుబడితో మీ ఫ్యూచర్ సురక్షితంగా మార్చుకోవచ్చు.
స్కీమ్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఏంటి? :
ఈ పథకం కింద రైతులు 60 ఏళ్ల వయస్సు వచ్చాక నెలకు రూ. 3వేలు లేదా ఏడాదికి రూ.36వేలు ఫిక్స్డ్ పింఛను (PM Kisan Maandhan Yojana) పొందవచ్చు. ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు చెల్లించాల్సిన ప్రీమియం వయస్సును బట్టి మారుతుంది. మీరు తక్కువ వయస్సు వారైతే నెలకు కేవలం రూ. 55 ఆదా చేయొచ్చు. గ్యారెంటీ పింఛను స్కీమ్ కింద నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది.
అర్హత, షరతులివే :
ఈ పథకం బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. మరో నిబంధన ఏమిటంటే.. దరఖాస్తుదారులు NPS, EPFO, లేదా ESIC వంటి మరే ఇతర ప్రభుత్వ పింఛను పథకంలో ఉండకూడదు. అలాగే, బెనిఫిట్స్ కోరుకునే రైతులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా కూడా ఉండకూడదు.
Read Also : Income Tax Return : ITR ఫైలింగ్‌లో మిస్టేక్ చేశారా? నోటీసులు, పెనాల్టీలు తప్పించుకోవాలంటే వెంటనే ఇలా చేయండి!
ఈ సింపుల్ ప్రాసెస్ :
పీఎం కిసాన్ మాంధన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు కింది దశలను ఫాలో చేయడం ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి : ముందుగా, స్కీమ్ అధికారిక వెబ్సైట్ (maandhan.in)ను విజిట్ చేయండి.
లాగిన్ : హోమ్‌పేజీకి రైట్ సైడ్ ఉన్న లాగిన్ బటన్ క్లిక్ చేయండి. మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి.
పథకాన్ని ఎంచుకోండి : డాష్‌బోర్డ్‌లో PM-KMY పథకాన్ని ఎంచుకుని రిజిస్టర్‌పై క్లిక్ చేయండి.
వివరాలు నింపండి : ఫారంలో మీ పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ వంటి మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
బ్యాంకు, నామినీ వివరాలు : మీ బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్‌ను ఎంటర్ చేయండి. మీ నామినీ వివరాలను సమర్పించండి.
ఆటో-డెబిట్ కన్సెంట్ : ప్రీమియం మొత్తాన్ని నేరుగా ఖాతా నుంచి డెబ్ట్ అయ్యేందుకు ఆటో-డెబిట్ కన్సెంట్ ఇచ్చి, ఆపై ఫారమ్‌ను సమర్పించాలి. ప్రింటౌట్ దగ్గర పెట్టుకోండి.
