Credit Card Balance : మీరు ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 మార్గాల్లో ఈజీగా బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు తెలుసా?

Credit Card Balance : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ అండ్ స్టేట్ మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఈ 5 మార్గాల్లో చాలా సింపుల్‌గా మీ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు.

Credit Card Balance

HDFC Credit Card Balance : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువగా పెరిగింది. క్రెడిట్ కార్డ్‌లు అనేది ఒక ప్రధాన ఎంపికగా మారాయి. ఎందుకంటే.. క్రెడిట్ తీసుకున్న మొత్తం తర్వాత చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తుంది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు అయినా వాడుతుంటారు. అందులో ఎక్కువగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు కామన్‌గా ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డులతో ప్రయాణాలు కావొచ్చు, విందు, వినోదం, షాపింగ్ ఇలా మరెన్నో వాటిపై అద్భుతమైన డీల్స్, రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్‌లపై అనేక ఆఫర్లను అందిస్తుంది. తద్వారా మీ బడ్జెట్‌ తగినట్టుగా లగ్జరీని ఆస్వాదించవచ్చు.

Read Also : RRB NTPC 2025 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష తేదీలపై ఉత్కంఠ.. ఎంపిక ప్రక్రియ, ఏ పోస్టుకు జీతం ఎంతో తెలుసా?

అయితే, మీ లావాదేవీలను ట్రాక్ చేయడంతో పాటు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తెలివిగా ఖర్చు చేయడం చాలా ముఖ్యమని గమనించాలి. ఇంతకీ మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే.. బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా? :
మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను 5 మార్గాల్లో చెక్ చేయవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నెట్ బ్యాంకింగ్ (Netbanking) ద్వారా :

  • మీ లాగిన్ వివరాలను ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
  • మెను నుంచి కార్డ్‌ (Cards)ల సెక్షన్ ఎంచుకోండి.
  • మీరు డ్యాష్‌బోర్డ్ నుంచి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.
  • చివరి బిల్లు జనరేషన్ నుంచి మీ ఇటీవలి ఖర్చులను ట్రాక్ చేసేందుకు మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్, అన్‌బిల్డ్ లావాదేవీలను చెక్ చేయండి.

2.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ యాప్ (Mobile App) ద్వారా :

  • మీ ఫోన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
  • మెయిన్ మెను నుంచి ‘Credit Cards’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ కార్డ్ బ్యాలెన్స్, అన్‌బిల్డ్ లావాదేవీలు, మీ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఇతర వివరాలను హోమ్ స్క్రీన్‌పై చూడవచ్చు.

3.కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ (Customer Care Helpline) ద్వారా :

  • కస్టమర్ సపోర్ట్ ద్వారా మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేయొచ్చు.
  • 6160 6161కి హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి.
  • అందించిన (IVR) సూచనలను అనురిస్తూ కాల్ కొనసాగించండి.
  • ప్రాంప్ట్ చేసిన విధంగా అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • ఫోన్ కాల్ సమయంలో మీరు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ సమాచారాన్ని అందుకుంటారు.

4.ఏటీఎం ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ (ATM)  :

  • మీ సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లండి.
  • మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని మెషీన్‌లో పెట్టండి.
  • మెను నుంచి ‘View Statement’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఏటీఎం స్క్రీన్ స్క్రీన్‌పై మీ స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌ డిస్‌ప్లే అవుతుంది.

5. ఎస్ఎంఎస్ (SMS) ద్వారా చెకింగ్  :

  • SMS పంపడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించండి.
  • CCBAL <space> XXXX అని టైప్ చేయండి (ఇక్కడ “XXXX” మీ క్రెడిట్ కార్డ్‌లోని చివరి 4 అంకెలు).
  • 5676712కు SMS పంపండి.
  • మీరు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ వివరాలతో రిప్లయ్ అందుకుంటారు.

క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ప్రాముఖ్యత :
మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను పర్యవేక్షిస్తుండాలి. ఎందుకంటే.. మీ ఖర్చులను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేయడంలో సాయపడుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఆర్థిక భారాన్ని నివారించవచ్చు. ఈ విధంగా మీ క్రెడిట్ వినియోగాన్ని కూడా బ్యాలెన్స్‌లో ఉంచుకోవచ్చు . మీరు భారత్, అంతర్జాతీయంగా మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ గురించి విచారించవచ్చు. మీకు కావలసిందల్లా.. మీ క్రెడిట్ కార్డ్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది.

చివరిగా ఒక మాట.. సరిగ్గా ప్లాన్ చేస్తే.. స్మార్ట్ లావాదేవీలకు క్రెడిట్ కార్డ్‌లు అద్భుతంగా సాయపడతాయి. క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయని అదేపనిగా కొనుగోళ్లు చేయకూడదు. ఎందుకంటే.. భరించలేని భారీ బిల్లుకు దారితీయవచ్చు. అందుకే తెలివిగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా మీ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : 8th Pay Commission : కీలక అప్‌డేట్.. ఇదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసా?