Download E Pan Card
E-Pan Card : మీకు పాన్ కార్డు ఉందా? లేదంటే ఇప్పుడే కొత్త పాన్ కార్డు తీసుకోండి. పాన్ కార్డు హార్డ్ కాపీ కన్నా డిజిటల్ ఇ-పాన్ కార్డు తీసుకోవడం బెటర్.. ఆర్థిక లావాదేవీల సమయంలో ఇ పాన్ కార్డు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
సాధారణంగా పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రభుత్వం జారీ చేసే అధికారిక డాక్యుమెంట్. ఈ 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్ కార్డును వ్యక్తిగతంగానూ, వ్యాపార సంస్థలు, ఎన్ఆర్ఐలు, ఇతర సంస్థలు తీసుకోవచ్చు.
ఈ కార్డు ద్వారా ఆదాయ పన్ను శాఖ అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. ఎవరైనా టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టకుండా చూడొచ్చు. అన్ని పన్ను సంబంధిత కార్యకలాపాలను ఈ కార్డుతోనే లింక్ చేయొచ్చు. ఆదాయపు పన్ను దాఖలుకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఉపయోగించవచ్చు.
మీ వ్యాలీడ్ ఐడీ ప్రూఫ్‌గా కూడా పనిచేయవచ్చు. సాధారణంగా పాన్ కార్డ్ హార్డ్ కాపీలోనే జనరేట్ అవుతుంది, కానీ మీరు ఒకవేళ ఇంటి వద్దనే మర్చిపోతే ఇ-పాన్ కార్డ్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇంతకీ ఇ-పాన్ కార్డ్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1 : మీ ల్యాప్‌టాప్‌లో, (Protean Tech) టాక్స్ ఇన్ఫ ర్మేషన్ పోర్టల్ సైట్ ఓపెన్ చేయండి.
2 : మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఏడాది, (GSTN ఆప్షనల్) ఎంటర్ చేయండి.
3 : క్యాప్చా వెరిఫై చేశాక జిప్ కోడ్‌తో విండో ఓపెన్ అవుతుంది. OTP జనరేట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
4 : మీకు OTP వచ్చాక వెంటనే వెరిఫై చేయండి.
5 : పేమెంట్ మోడ్ కొత్త విండో ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ మధ్య ఎంచుకోవచ్చు.
6 : మీరు పేమెంట్ మెథడ్ ఎంచుకున్నాక సైటులో రూ. 8.26 పేమెంట్ చేయాలి.
7 : పేమెంట్ తర్వాత మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఇ-పాన్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రూ. 8.26 చెల్లించడం ద్వారా మీ E-PAN కార్డును ఎన్నిసార్లు అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు డౌన్‌లోడ్ విషయంలో ఎలాంటి పరిమితిని విధించలేదు. మీ ఇంటికి ఇ-పాన్ కార్డు కాకుండా హార్డ్ కాపీని డెలివరీ రావాలంటే మీరు రూ. 50 చెల్లించాలి. మీరు e-PAN కార్డు కోసం అప్లయ్ చేసుకునేటప్పుడు దయచేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నంబర్, GSTN కార్డును అందుబాటులో ఉంచుకోండి.