How to Make Your Resume : గూగుల్‌లో మీకు ఉద్యోగం కావాలా నాయనా?.. మీ రెజ్యూమ్‌లో ఈ 5 తప్పులు అసలే చేయొద్దు..!

How to Make Your Resume : ఏ ఉద్యోగానికి అప్లయ్ చేసినా ప్రతిఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. తమ రెజ్యూమ్ ప్రీపేర్ చేయడమే. ఆ రెజ్యూమ్‌లోనే మీ ఉద్యోగ అర్హతలన్నీ ఉంటాయి. మీరు ప్రీపేర్ చేసిన CV ఆధారంగానే రిక్రూటర్లు మీకు ఉద్యోగం ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయిస్తారు.

How To Make Your Resume _ Want to get a job in Google_ Don’t write these five things in your resume

How to Make Your Resume :  గూగుల్ కంపెనీలో ఉద్యోగమంటే అంత ఈజీ కాదు.. గూగుల్‌లో ఉద్యోగం కావాలని ఎవరికి మాత్రం ఉండదు.. చాలామంది గూగుల్ ఉద్యోగం అనేది వారి లైఫ్ డ్రీమ్ గా భావిస్తుంటారు. వాస్తవానికి గూగుల్ వంటి అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలంటే అందుకు తగినట్టుగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి అంటారు. కానీ, వాటితో పాటు మరొకటి కచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే మీకు గూగుల్‌లో ఉద్యోగం వస్తుందని చెప్పవచ్చు.

ఇంతకీ అదేంటి అంటారా? ఏం లేదండీ.. మీ రెజ్యూమ్.. (CV).. ఇది సరిగా లేకుంటే మీకు ఎంత స్కిల్స్ ఉన్నా వ్యర్థమే అనే విషయం గుర్తించుకోవాలి. ఏ ఉద్యోగానికి అప్లయ్ చేసినా ప్రతిఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. తమ రెజ్యూమ్ ప్రీపేర్ చేయడమే. ఆ రెజ్యూమ్‌లోనే మీ ఉద్యోగ అర్హతలన్నీ ఉంటాయి. మీరు ప్రీపేర్ చేసిన CV ఆధారంగానే రిక్రూటర్లు మీకు ఉద్యోగం ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయిస్తారు.

Want to get a job in Google_ Don’t write these five things in your resume

మీరు CV చూడగానే మీరు ఎంత సమర్థులో చెప్పేయవచ్చు. అందుకే Resume విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కానీ, చాలామంది రెజ్యూమ్ ఏదో నామమాత్రంగా పెట్టి ఉద్యోగానికి అప్లయ్ చేస్తుంటారు. కానీ, చాలావరకూ మీకు ఇంటర్వ్యూ కాల్స్ రాకుండా ఉండటానికి CV కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మరి.. అలాంటి CV ఎలా ప్రీపేర్ చేయాలి.. ఎలాంటి ముఖ్య విషయాలను ప్రస్తావించాలి అనేది తెలిసి ఉండాలి.

చాలామంది చేసే తప్పు ఏంటంటే.. తమ రెజ్యూమ్‌లో ముఖ్యమైన విషయాల కన్నా అనవసరమైన విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. రెజ్యూమ్ ప్రీపేర్ చేసే విధానంలో అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అందుకే గూగుల్ వంటి కంపెనీల్లో ఉద్యోగం పొందడమే మీ డ్రీమ్ అనుకుంటే.. మీ రెజ్యూమ్ రూపొందించే సమయంలో ఈ 5 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..

Read Also : Twitter Edit Feature : మీ ట్వీట్‌ను ఇకపై 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు.. కానీ, ఆ టైంలోగా మాత్రమే.. తప్పక తెలుసుకోండి!

మీ రెజ్యూమ్‌లో ఈ 5 అంశాలు అసలే రాయొద్దు :
మీ రెజ్యూమ్‌లో సరైన, సంబంధిత అంశాలతో నింపడం కూడా చాలా ముఖ్యం. మీరు Google, ఇతర కంపెనీలలో ఉద్యోగం పొందాలనుకుంటే మీ రెజ్యూమ్‌లో ప్రస్తావించరాని విషయాలను అసలే రాయొద్దు. Google రిక్రూటర్ TikTokలో ఒక వీడియోను పోస్ట్ చేసారు. Googleలో చికాగోకు చెందిన సీనియర్ రిక్రూటర్ (Erica Rivera) ఎరికా రివెరా.. మీ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా ఎలా ప్రీపేర్ చేసుకోవాలో కొన్ని చిట్కాలను TikTokలో ప్రస్తావించారు.

టిక్‌టాక్‌లో ఎరికా వీడియోను 2 మిలియన్ల మంది వీక్షించారు. ఆ చిట్కాలను చూసిన వారంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. వేలాది వెబ్‌సైట్‌లను స్క్రీనింగ్ చేశానని, చాలామంది తమ రెజ్యూమ్‌లలో అవాంఛిత డేటాను చేర్చినట్లు కనుగొన్నారని ఆమె వీడియోలో చెప్పింది.

Want to get a job in Google_ Don’t write these five things in your resume

ఉద్యోగానికి అప్లయ్ చేసే వారు ఎవరైనా తమ రెజ్యూమ్‌లో తమ పూర్తి అడ్రస్ (Full Address) రాయకూడదని, తనకు అసలు ఇష్టం ఉండదని తెలిపింది. సింపుల్‌గా మీ రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తే సరిపోతుందని ఆమె అంటున్నారు. మీరు మీ CVలో చేర్చకూడని మరో ముఖ్యమైన విషయం.

మీ వర్కింగ్ హిస్టరీ (Work History). మీకు చాలా అనుభవం ఉంది కదాని మీ మొత్తం వర్క్ హిస్టరీ వంటి వివరాలను అసలే చేర్చకూడదు. ఎందుకంటే.. మీ వృత్తిని ప్రారంభించినప్పటి నుంచి తమకు మీ పూర్తి వర్క్ హిస్టరీ అవసరం లేదని తెలిపింది. మీరు అప్లయ్ చేస్తున్న జాబ్ రోల్‌కు అనుగుణంగా ఉండాలని ఆమె సూచించారు. రెజ్యూమ్‌ను రూపొందించడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని పేర్కొంది.

Want to get a job in Google_ Don’t write these five things in your resume

మరో విషయం.. మీ రెజ్యూమ్‌లో ఎప్పుడూ కూడా (I helped, I was responsible for) అనే వీక్ వర్డ్స్ అసలే రాయొద్దని రివెరా ఉద్యోగ దరఖాస్తుదారులను కోరారు. రెజ్యూమ్‌లో మీ జనరిక్ పదాలుకు బదులుగా యాక్టివ్ వెర్బ్‌లను ఎక్కువగా ఉపయోగించాలని ఆమె సిఫార్సు చేసింది. అంటే.. (managed, implemented, improved, strategized, increased, produced, generated) అనే పదాలను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆమె సూచించారు. కంపెనీలు రిఫరెన్స్ కావాలనుకుంటే.. మిమ్మల్ని అడుగుతారని రివెరా వివరించారు.

అంతేకానీ, దరఖాస్తుదారులు తమ CVలలో ఇలాంటి విషయాలను పేర్కొనడం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. Google రిక్రూటర్ ప్రకారం.. రెజ్యూమ్‌లో ప్రస్తావించకూడని మరో విషయం.. రెజ్యూమ్ పైభాగంలో objective అని రాస్తుంటారు. వాస్తవానికి ఇది అవసరం లేదు. ఇందులో పాత లక్ష్యాలను ప్రస్తావిస్తారు. ప్రస్తుత కాలంలో మీ నూతన లక్ష్యాలను మాత్రమే ప్రస్తావించేలా ఉండాలనే విషయం తప్పక గుర్తించుకోండి.

Read Also : iPhone 14 Price in India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర.. విదేశాల్లో కన్నా భారత్‌లోనే ఎక్కువ.. ఏయే దేశాల్లో చౌకైన ధరకే లభిస్తుందో తెలుసా? ఇదిగో లిస్ట్..!