iPhone 14 Price in India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర.. విదేశాల్లో కన్నా భారత్‌లోనే ఎక్కువ.. ఏయే దేశాల్లో చౌకైన ధరకే లభిస్తుందో తెలుసా? ఇదిగో లిస్ట్..!

iPhone 14 Price in India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్‌ (Apple Far Out Event)లో అనేక ఆపిల్ ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అందులో ఐఫోన్ 14 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం నాలుగు మోడళ్లలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసింది.

iPhone 14 Price in India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర.. విదేశాల్లో కన్నా భారత్‌లోనే ఎక్కువ.. ఏయే దేశాల్లో చౌకైన ధరకే లభిస్తుందో తెలుసా? ఇదిగో లిస్ట్..!

iPhone 14 price in India is much higher than other countries, here's where it is available at cheapest price

iPhone 14 Price in India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్‌ (Apple Far Out Event)లో అనేక ఆపిల్ ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అందులో ఐఫోన్ 14 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం నాలుగు మోడళ్లలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) ఇప్పుడు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా అందుబాటులో ఉంది. ఈ కొత్త ఐఫోన్ సిరీస్ 4 వెర్షన్లలో వస్తుంది. iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxగా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

iPhone 14 price in India is much higher than other countries, here's where it is available at cheapest price

iPhone 14 price in India is much higher than other countries

ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐఫోన్‌ల మాదిరిగానే.. ఐఫోన్ 14 సిరీస్ ధర (iPhone 14 Series Price) అమెరికాలో కన్నా భారత మార్కెట్లో అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు. వాస్తవానికి, యూకే, చైనా, న్యూజిలాండ్, యూఏఈతో పాటు అనేక ఇతర దేశాల్లో iPhone 14 Series ధర చాలా చౌకైన ధరకే అందుబాటులో ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత మార్కెట్లో మాత్రమే iPhone 14 ధర చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

మరోవైపు, కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం ఐఫోన్ 14 (iPhone 14 Series Price) ధరను అమెరికాలోని ఐఫోన్ 13 (iphone 13)కి కొంతవరకు సమానంగా ఉంటుంది. అయితే, కొన్ని గ్లోబల్ మార్కెట్‌లలో ధరను భారీగా పెంచేసింది. అమెరికాలో iPhone 14 బేస్ 128GB మోడల్ 799 డాలర్ల వద్ద లభిస్తోంది. గత ఏడాదిలో ప్రవేశపెట్టిన iPhone 13 లాంచ్ ధర మాదిరిగానే ఉంటుంది. అత్యంత ఖరీదైన iPhone 14 వెర్షన్, iPhone 14 Pro Max ధర 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మళ్లీ iPhone 13 Pro Max లాంచ్ ధరకు సమానంగా ఉంటుంది.

iPhone 14 price in India is much higher than other countries, here's where it is available at cheapest price

iPhone 14 price in India is much higher than other countries

భారత యూజర్లు మాత్రం iPhone 14ని కొనుగోలు చేయాలంటే కష్టమే అని చెప్పాలి. మీకు iPhone 14 Series తక్కువ ధరకు పొందాలంటే కొన్ని ఇతర దేశాలలో నివసిస్తున్న మీ స్నేహితులు, బంధువులను కోరవచ్చు. ఇతర దేశాలలో iPhone 14 సిరీస్ ధర ఎంత ఉంది? ఏ దేశాలు తక్కువ ధరకు అందిస్తాయో ఓసారి లుక్కేయండి.

1. భారత మార్కెట్లో iPhone 14 సిరీస్ ధర ఎంతంటే? :

* iPhone 14 ప్రారంభ ధర రూ.79,900

* iPhone 14 Plus ప్రారంభ ధర రూ. 89,990

* iPhone 14 Pro ప్రారంభ ధర రూ.1,29,900

* iPhone 14 Pro Max ప్రారంభ ధర రూ.1,39,900

2. iPhone 14 series price in the United States

* iPhone 14 ప్రారంభ ధర $799 (దాదాపు రూ. 64,000)

* iPhone 14 Plus ప్రారంభ ధర $899 (సుమారు రూ. 72,000)

* iPhone 14 Pro ప్రారంభ ధర $999 (సుమారు రూ. 80,000)

* iPhone 14 Pro Max ప్రారంభ ధర $1,099 (సుమారు రూ. 88,000)

3. iPhone 14 series price in the United Kingdom

* iPhone 14 £849 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 78,000)

* iPhone 14 Plus £949 వద్ద ప్రారంభమవుతుంది (దాదాపు రూ. 87,000)

* iPhone 14 Pro £1,099 (సుమారు రూ. 1లక్ష) వద్ద ప్రారంభమవుతుంది

* iPhone 14 Pro Max ప్రారంభ ధర £1,199 (దాదాపు రూ. 1.1 లక్షలు)

4. iPhone 14 series price in Dubai (UAE)

* iPhone 14 AED 3,399 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 74,000)

* iPhone 14 Plus AED 3,799 (సుమారు రూ. 83,000) వద్ద ప్రారంభమవుతుంది

* iPhone 14 Pro AED 4,299 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 94,000)

* iPhone 14 Pro Max AED 4,699 (దాదాపు రూ. 1 లక్ష) వద్ద ప్రారంభమవుతుంది.

iPhone 14 price in India is much higher than other countries, here's where it is available at cheapest price

iPhone 14 price in India is much higher than other countries

5. iPhone 14 series price in China Mainland

* iPhone 14 CNY 5,999 (సుమారు రూ. 69,000)

* iPhone 14 Plus CNY 6,999 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 80,000)

* iPhone 14 Pro CNY 7,999 (సుమారు రూ. 92,000) నుండి వస్తుంది.

* iPhone 14 Pro Max CNY 8,999 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 1 లక్షలు)

6. iPhone 14 series price in Hong Kong

* iPhone 14 HK$ 6,899 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 70,000)

* iPhone 14 Plus HK 7,699 డాలర్లు (సుమారు రూ. 78,000)

* iPhone 14 Pro HK 8,599 డాలర్లు (సుమారు రూ. 87,000) వద్ద ప్రారంభమవుతుంది.

* iPhone 14 Pro Max HK 9,399 డాలర్లు (రూ. 95,500) వద్ద ప్రారంభమవుతుంది

7. iPhone 14 series price in Australia

* iPhone 14 ప్రారంభ ధర 1,399 డాలర్లు (రూ. 76,000)

* iPhone 14 Plus ధర 1,579 డాలర్లు (రూ. 86,000)

* iPhone 14 Pro ప్రారంభ ధర 1,749 డాలర్లు (రూ. 95,000)

* iPhone 14 Pro Max ధర 1,899 డాలర్లు (రూ. 1లక్ష)

iPhone 14 price in India is much higher than other countries, here's where it is available at cheapest price

iPhone 14 price in India is much higher than other countries

8. iPhone 14 series price in New Zealand

* iPhone 14 NZ $ 1599 (సుమారు రూ. 78,000)

* iPhone 14 Plus NZ $ 1799 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 88,000)

* iPhone 14 Pro NZ$ 1999 వద్ద వస్తుంది (సుమారు రూ. 97,000)

* iPhone 14 Pro Max NZ$ 2199 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 1.10 లక్షలు)

9. iPhone 14 series price in Japan

* iPhone 14 JPY 1,19,800 వద్ద లభిస్తుంది (సుమారు రూ. 67,000)

* iPhone 14 Plus JPY 1,34,800 (సుమారు రూ. 75,000)తో ప్రారంభమవుతుంది

* iPhone 14 Pro JPY 1,49,800 వద్ద ప్రారంభమవుతుంది (సుమారు రూ. 83,000)

* iPhone 14 Pro Max JPY 1,64,800 (సుమారు రూ. 92,000) వద్ద ప్రారంభమవుతుంది.

భారత్‌లోనే iPhone 14 Series ఖరీదు ఎక్కువ.. ఎందుకంటే?

ఏయే దేశాల్లో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఎంత చౌకైన ధరకు లభిస్తుందో ఈ లిస్టు చూస్తే తెలుస్తుంది. ఐఫోన్ 14 అమెరికాలో చౌకైన ధరకు అందుబాటులో ఉంది. ఆ తర్వాత జపాన్, మెయిన్‌ల్యాండ్ చైనా, హాంకాంగ్, ఇతర దేశాలు ఉన్నాయి. ఇప్పుడు, మీరు అమెరికా నుంచి ఐఫోన్ 14ని పొందాలనుకుంటే.. మోడల్ సిమ్ ట్రేతో రాకపోవచ్చు. ఎందుకంటే.. అమెరికాలో అన్ని ఐఫోన్ 14 ICM సపోర్టుతో వస్తుంది. భారత మార్కెట్లో అయితే eSIM పొందవచ్చు. మీరు iPhone 14 కొనుగోలు చేయాలంటే జపాన్ లేదా చైనాలో ఉండే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను కోరవచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ 14 ధర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే GST, దిగుమతి సుంకంతో పాటు ఇతర ఛార్జీలు వర్తిస్తాయి.

Read Also : iPhone 14 Pro Models in India : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వచ్చేశాయి. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత? సేల్ డేట్ ఇదేనా? ఫుల్ లిస్ట్ మీకోసం..!