Apple Phone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Apple Phone 15 Discount : 2023 సెప్టెంబర్‌‌లో అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 12వేల తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను ఎలా పొందవచ్చో చూడవచ్చు.

Apple Phone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Here is how you can get Apple Phone 15 at Rs 12,000 discount

Apple Phone 15 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఒకటి. అమెజాన్ ఇండియాలో ఐఫోన్ 15 అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉంది. 2023 ఏడాదిలో ఐఫోన్ 15 సెప్టెంబర్ 12న ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ అయింది.

ఈ ఫోన్ సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చింది. ఢిల్లీలో కొత్తగా ఓపెన్ చేసిన ఆపిల్ స్టోర్ల వెలుపల కస్టమర్లు ఈ ఐఫోన్ 15 కోసం క్యూలలో నిలబడ్డారు. ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900కు సొంతం చేసుకోవచ్చు. 512జీబీ వేరియంట్ రూ. 1,09,900కి పొందవచ్చు. ఈ ఫోన్ 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14తో పోల్చినప్పుడు పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Order : ఇదేంటి భయ్యా.. ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. ఇంటికి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది..!

ఇప్పుడు, ఐఫోన్ 15 సేల్స్ అధికారికంగా ప్రారంభమైనందున వివిధ అవుట్‌లెట్‌లు లేటెస్ట్ ఐఫోన్‌పై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, ఇతరులతో పాటు, కస్టమర్‌లకు కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లను కలిగి ఉన్నాయి. అయితే, రూ. 35వేల లోపు లేటెస్ట్ ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15ని ఈ ధరలో పొందడం నిజంగా సాధ్యమే. మీ పాత ఐఫోన్ నుంచి కొత్తదానికి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

రూ. 12వేల తగ్గింపుతో ఐఫోన్ 15 సొంతం :

ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15పై అమెజాన్ ఇండియాలో కొన్ని స్పెషల్ డీల్స్ అందిస్తోంది. ఫలితంగా, మీరు రూ. 12వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ డీల్‌ను చెక్ చేయడానికి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో విజిట్ చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది.

దీనికి అదనంగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కి మారితే అదనంగా రూ. 7వేల తగ్గింపు పొందవచ్చు. అందువల్ల, ఈ ఐఫోన్ మొత్తం విలువను రూ. 12వేలు తగ్గించవచ్చు. మీరు ఫోన్ ధరను మరింత తగ్గించాలనుకుంటే, కొత్త ఐఫోన్ 15 కోసం పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ మెరుగైన వర్కింగ్ కండిషన్‌లో ఉంటే మరింత తగ్గింపు పొందవచ్చు.

Here is how you can get Apple Phone 15 at Rs 12,000 discount

Apple Phone 15 discount

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్ :
ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 15 ఈసారి కూడా ఐఫోన్ 14 మునుపటి మోడల్‌ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంది. అయితే, గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌లతో పోలిస్తే.. సాధారణ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్‌ని పొందవచ్చు.

ఈసారి అప్‌గ్రేడ్ చేసిన 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉన్నందున కెమెరా విభాగంలో కొన్ని భారీ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్ 12ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అందువల్ల, ఐఫోన్ 15 భారీ అప్‌గ్రేడ్‌ను పొందింది. మెరుగైన తక్కువ కాంతి ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఐఫోన్ 15 రోజంతా బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఎ16 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా అప్‌గ్రేడ్ అయింది. గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో ఎ15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అయితే, ప్రో మోడల్‌లు వేగంగా మెరుగైన ఎ16 చిప్‌ను పొందాయి. ఐఫోన్ 15 యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌కి మారడంతో ఆపిల్ లైటనింగ్ పోర్ట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికింది. సాధారణంగా ఉపయోగించే యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్‌ ఐఫోన్లలోనూ వినియోగించవచ్చు. మీరు వెళ్లిన ప్రతిచోటా మీ ప్రత్యేక ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను తీసుకెళ్లాల్సిన పనిలేదు.

Read Also : Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్.. కేవలం రూ.27,499కే సొంతం చేసుకోవచ్చు!