Luxury Projects : హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లకు ఫుల్‌ డిమాండ్

Huge Demand For Luxury Projects : కొనుగోలుదారులు లగ్జరీ ఇళ్లకే జై కొడుతోన్నారు. ధర కాస్త ఎక్కువైనా తగ్గేదేలే అంటోన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్‌ పెరిగింది. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమినిటీస్‌ తప్పనిసరి అంటున్నారు.

Huge Demand For Luxury Projects

Huge Demand For Luxury Projects : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి.  2బీహెచ్‌కే నుంచి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ధరలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే నగరవాసులు ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకర వాతావరణానికి ప్రజలు జై కొడుతుండటంతో… బిల్డర్స్‌ లగ్జరీ ప్రాపర్టీస్‌ నిర్మాణంపై దృష్టిపెట్టారు. లగ్జరీ ఎమినిటీస్‌తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టుల్లో పెద్దపీట వేస్తున్నారు. బయ్యర్స్‌ అభిరుచికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి.

Read Also : Hyderabad Realty: హైదరాబాద్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోన్న నిర్మాణ రంగం.. స్థిరమైన వృద్ధితో ఫుల్‌ జోష్‌

కొనుగోలుదారుల మైండ్‌సెట్‌కు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్‌ను డెవలప్‌ చేస్తున్నారు బిల్డర్స్. లే అవుట్‌లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లకు, ఫుట్‌పాత్‌లకు గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌజ్, జిమ్, పార్కులు, ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు.

లగ్జరీకి జై కొడుతోన్న కొనుగోలుదారులు :
ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో   బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌తో పాటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఆకాశ హార్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. నార్సింగి, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మంచి రేవుల, నల్లగండ్ల, కొల్లూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు 59 అంతస్తుల వరకు హెచ్ఎండీఏ అనుమతులు మంజూరు చేయగా… అంతకంటే ఎక్కువ ఎత్తైన ప్రాజెక్టుల కోసం దరఖాస్తులు హెచ్‌ఎండీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో లగ్జరీ ఇళ్ల నిర్మాణాలకు బిల్డర్లు ముందుకు వస్తున్నారంటే వాటికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు ప్రీమియం ప్రాపర్టీలను అందించేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి. అందులో రెండు వేల  చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో డెవలప్‌ అవుతున్న నిర్మాణాల్లో దాదాపు 35శాతం వరకు లగ్జరీ ప్రాజెక్టులే ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో 50 నుంచి 60 అంతస్తుల నిర్మాణాలను సైతం ఎంతో ఈజీగా కంప్లీట్‌ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు.

అంతే కాకుండా విదేశాల్లో పెద్దపెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసిన టెక్నిషియన్స్‌ను ఇక్కడికి రప్పించడంతో హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతోన్నాయి. వరల్డ్‌ క్లాస్‌ ఎమినిటీస్‌తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో సువిశాలైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్‌.

Read Also : Hyderabad Property Value : దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ

ట్రెండింగ్ వార్తలు