Hyderabad Property Value : దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ

Hyderabad Property Value : అఫర్డబుల్ హౌసింగ్‌కు హైదరాబాద్ మారు పేరుగా నిలుస్తోంది. గత కొంతకాలం నుంచి హైదరాబాద్‌లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతోంది.  ముంబైకి పోటీగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కాస్ట్‌ పెరుగుతూ వస్తోంది.

Hyderabad Property Value : దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ

Hyderabad Property Value

Hyderabad Property Value : ఎన్నో ఏళ్లుగా అఫర్డబుల్ హౌసింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో ప్రాజెక్టుల కాస్ట్‌ క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రాపర్టీ వాల్యూ వృద్ధిలో మాత్రం జోరుమీదుంది. వెస్ట్ జోన్‌తోపాటు ఈస్ట్ జోన్‌లోని చాలా ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు… ప్రాజెక్టు కంప్లీట్‌ అయ్యేసరికి ఎస్‌ఎఫ్‌టీ వెయ్యి రూపాయల నుంచి 15వందల రూపాయల వరకు పెరుగుతోంది. మరికొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ పెరుగుదల మరింత అధికంగా ఉంది.

ఇక హైదరాబాద్‌ మహానగరంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు…  ప్రాపర్టీ డెలివరీ టైమ్‌కు ఎంత విలువ పెరుగుతుందో ముందే అంచనా వేసి చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్‌ ముందుగానే చెల్లిస్తే.. తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి. అలా చూసినప్పుడు వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు 6 శాతం వరకు ప్రాజెక్టు కాస్ట్‌లో వృద్ధి నమోదైనట్లు స్టడీస్ చెబుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో సైతం వృద్ధి గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ హౌసింగ్‌ ధరల్లో 24శాతం వృద్ధి : 
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. దేశ వ్యాప్తంగా సగటున 10 నుంచి 24 శాతం మేర పెరుగుదల నమోదైంది. అయినా సిటిలో హౌసింగ్ ప్రాపర్టీల కొనుగోలుకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో హౌసింగ్‌ ప్రాపర్టీల డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇండిపెండెంట్‌ ఇళ్లు, ఓపెన్‌ ల్యాండ్స్‌, ఫ్లాట్స్‌ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.

ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాల్టీ రంగంలో చక్కని అప్రిషియేషన్‌ ఉండటంతో… ఈ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్స్‌ ఉత్సాహపడుతున్నారని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న ఉపాధికల్పనతోపాటు…, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్‌లో రియాల్టీ రంగం ఫుల్‌ జోష్‌తో పరుగులు పెడుతోందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

ఇక హైదరాబాద్‌తో పాటు సరౌండింగ్‌ ఏరియాల్లో భూముల ధరలు  కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికితోడు కన్‌స్ట్రక్షన్‌ కాస్ట్‌ కూడా పెరగడంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరుగుతోంది. ఉండేందుకు ఓ ఇల్లు.. పెట్టుబడి కోసం మరో ఇల్లు అనే కాన్సెప్ట్‌ కొనుగోలుదారుల్లో పెరగడంతో హౌసింగ్‌ డిమాండ్‌ భారీగా పెరిగేందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.