Stock Markets: 2 శాతానికి పైగా స్టాక్ మార్కెట్లు పతనం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. మళ్లీ ఐరోపా దేశాల్లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చే సూచనలతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

Stock Market
Stock Markets: స్టాక్ మార్కెట్లు.. షాక్ ఇచ్చాయి. భారీగా పతనమై.. ఇన్వెస్టర్లకు అనూహ్యమైన నష్టాలు మిగిల్చాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్, మళ్లీ లాక్ డౌన్ ముప్పు వంటి ఆందోళనలతో.. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2 శాతానికి పైగా నష్టపోయాయి.
56 వేల 517 పాయింట్ల వద్ద మొదలైన ఇవాల్టి సెన్సెక్స్ ట్రేడింగ్.. చివరి వరకూ నష్టాల బాటలోనే నడిచింది. ఒక దశలో.. 1800 పాయింట్లు పతనమై.. ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. ఆ దశ నుంచి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కాస్త మెరుగుపడి.. 1189 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 55,822 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసింది.
నిఫ్టీ విషయానికి వస్తే.. 16 వేల 824 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ ప్రారంభం కాగా.. ఓ దశలో 414 పాయింట్లు పతనమైంది. అక్కడి నుంచి.. ట్రేడింగ్ ముగిసేసరికి నష్టాన్ని 371 పాయింట్లకు తగ్గించుకుని.. 16 వేల 614 దగ్గర స్థిరపడింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. మళ్లీ ఐరోపా దేశాల్లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చే సూచనలు.. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సంకేతాల వంటివి.. స్టాక్ మార్కెట్లలో నష్టాల ర్యాలీకి కారణాలుగా అనలిస్టులు భావిస్తున్నారు.
Read More:
Election Laws Bill : ఆధార్- ఓటర్ బిల్లుకు లోక్సభ ఆమోదం
Nara Bhuvaneswari: వారివి పిచ్చిమాటలు.. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను -నారా భువనేశ్వరి