Hyderabad Development Mantra : అతిపెద్ద సిటీగా హైదరాబాద్? ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి మంత్ర

Hyderabad Development Mantra : హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళిక బద్దమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది.

Hyderabad Development Mantra

Hyderabad Development Mantra : హైదరాబాద్ మహానగర పరిధి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్..  సికింద్రాబాద్… తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్… అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇలా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళిక బద్దమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

దేశంలో అతిపెద్ద డెవలప్‌మెంట్ అథారిటీగా నిలువనుంది హెచ్‌ఎండీఏ. దేశంలోని ప్రధాన నగరాలను మించి అభివృద్ధి చెందుతోన్న మన విశ్వనగరం.. త్వరలోనే కాస్మో పాలిటన్‌ సిటీగా మారబోతుంది. దక్కన్ భూభాగంలో ఉండడం, ఎలాంటి భూకంప భయాలు లేకపోవడంతో పాటు వృద్ధికి అన్నివైపులా అవకాశం ఉండటం హైదరాబాద్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఐటీ, ఎడ్యుకేషన్‌, హెల్త్‌తో పాటు అన్ని రంగాల్లోనూ హైదరాబాద్‌ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు :
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధిని మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు GHMC పరిధి ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో మెగా మాస్టర్ ప్లాన్‌పై టీ-సర్కార్‌ ఫోకస్‌ చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హెచ్ఎండీఏ నిలువనుంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండీఏ 2008 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మొత్తం 7 వేల 257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. హైదరాబాద్‌తో చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, భువనగిరి, మెదక్‌, సిద్దిపేటలోని 70 మండలాల్లో ఒక వెయ్యి 32 గ్రామాలకు విస్తరించి ఉంది హెచ్‌ఎండీఏ. ఇందులో పలు మున్సిపాలిటీలు,  మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఇక హెచ్ఎండీఏ విస్తరిస్తే పదివేల చదరపు కిలోమీటర్ల పరిధికి చేరనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద నగర అభివృద్ధి సంస్థగా హెచ్ఎండీఏ అవతరించనుంది.

హెచ్‌ఎండీఏ విస్తరణ జరిగి భూములను వివిధ క్లస్టర్లుగా విభజిస్తే అభివృద్ధికి చాలా అవకాశం ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఆయా ప్రాంతాలను రోడ్లు, మెట్రో రైలు మార్గాల ద్వారా అనుసంధానించేలా చర్యలు తీసుకుంటే అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందంటున్నారు.

అలాగే హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ నుంచి ఓఆర్ఆర్‌ వరకు.. అక్కడి నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు రేడియల్‌ రోడ్డు ద్వారా మెట్రో కనెక్టివిటీ కల్పిస్తే… నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశముందని వారు చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధి పెరిగి మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌కు మరింత ఊతం లభించే అవకాశముంది.

Read Also : Dream Home : నెరవేరనున్న సొంతింటి స్వప్నం.. హైదరాబాద్‌లో భారీగా రానున్న హౌసింగ్‌ ప్రాజెక్టులు