ఓఆర్‌ఆర్‌ సమీపంలో 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ సిటీ.. రియాల్టీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్

హైదరాబాద్‌ సమీపంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం లభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Hyderabad Real estate market: గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో పారిశ్రమీకరణతో ఉపాధి అవకాశాలు పెంచాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోనుంది.

అన్ని రంగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎదిగింది హైదరాబాద్‌ నగరం. ముఖ్యంగా హైదరాబాద్‌ సమీపంలో అన్ని రకాల పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం ప్రపంచపటంలో హైదరాబాద్‌కు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ సర్కార్‌. సిటీకి శివారులోని ఓఆర్‌ఆర్‌కు సమీపంలో 25వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత సిటీగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కార్‌ భావిస్తోంది.

ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కాలనీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా సర్కార్‌ చర్యలు తీసుకోనుంది. గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇలాంటి క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ఇది రియాల్టీ రంగానికి బూస్టింగ్‌లా పనిచేయనుంది. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ సమీపంలో రియాల్టీ బిజినెస్‌ జోరుగా సాగుతోంది. ఓఆర్‌ఆర్‌ రేడియల్‌ రోడ్ల కనెక్టివిటీతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.

Also Read: విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్

ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం లభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు సరిపడా ఇళ్ల నిర్మాణం అవసరం అవుతుంది. దీంతో ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలో మరిన్ని నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిపెట్టాయి పలు రియాల్టీ సంస్థలు.

ట్రెండింగ్ వార్తలు