Demand For Spacious Homes : విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్

Demand For Spacious Homes : ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల ధరలు  పెరిగిపోతున్నాయి. నగరంలో అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 2,300 ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. గతేడాది కాలంలో 11శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు వరకు పెరిగాయి. 

Demand For Spacious Homes : విశాలమైన ఇళ్లకు హైదరాబాద్‌లో పెరుగుతున్న డిమాండ్

Demand For Spacious Homes

Updated On : February 20, 2024 / 2:25 PM IST

Demand For Spacious Homes : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు అపార్టుమెంట్స్‌ ఫ్లాట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇండిపెండెంట్‌ ఇళ్ల ధరలు పెరుగుతుండటంతో ఎంతోమంది ఫ్లాట్స్‌ వైపు మక్కువ చూపుతున్నారు. ఇండిపెండెంట్‌ ఇళ్ల కోసం సెంటర్‌ సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడని వారంతా ఫ్లాట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు.

Read Also : Hyderabad Property Value : దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ

ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం విశాలంగా ఉండే ఇళ్లు కావాలని మెజార్టీ బయ్యర్స్‌ కోరుకుంటున్నారు. ఒకప్పుడు 2బీహెచ్‌కే కోరుకున్న జనం ప్రస్తుతం ట్రి-బీహెచ్‌కే, ఫోర్‌-బీహెచ్‌కేపై ఆసక్తి చూపుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ.. డబ్బు విషయంలో కాంప్రమైజ్‌ కావడం లేదు. వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ విశాలమైన ఇళ్లలో నివసించేందుకే జనం జైకొడుతున్నారు.

11శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు :
ఇక దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ల సైజు 11శాతం పెరిగిందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2022లో సగటున 11 వందల 75 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా, 2023 నాటికి అది 13వందల ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. గత ఐదేళ్లలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 24శాతం మేర వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల సైజులు పెరిగాయి. 2022లో సగటున 13 వందల 75 చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ల విస్తీర్ణం… 2023 నాటికి సగటున 18వందల 90 ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఫ్లాట్‌ విస్తీర్ణం పెరుగుదల 37శాతంగా నమోదైంది.

దేశంలో ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే బెంగళూరులో సగటు ఫ్లాట్‌ విస్తీర్ణం 14వందల 64 ఎస్‌ఎఫ్‌టీ కాగా.. చెన్నైలో 12వందల 60, పూణేలో ఒక వెయ్యి 88 ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 2022లో 17వందల 75 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న సగటు ఫ్లాట్‌ విస్తీర్ణం… 2023లో అది 2వేల 3వందల ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. అంటే హైదరాబాద్‌లో సగటు ఎస్‌ఎఫ్‌టీ సైజ్‌ 30శాతం వృద్ధి చెందింది. దీనిబట్టి హైదరాబాద్‌లో సగటు ఇంటి పరిమాణం ఏటా భారీగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

Read Also : Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‎లో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు