Hyundai Creta Sales : భారత్‌లో హ్యుందాయ్ క్రెటా జోరు.. అమ్మకాల్లో 10లక్షల యూనిట్ల మైలురాయి దాటేసింది!

Hyundai Creta Sales : హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల విక్రయాల్లో దూసుకుపోతోంది. హ్యుందాయ్ క్రెటా మోడల్ భారత మార్కెట్లో ఏకంగా 10లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది.

Hyundai Creta reaches sales milestone of 10 Lakhs units in India

Hyundai Creta Sales : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాల్లో దూసుకుపోతోంది. భారత మార్కెట్లో 2015లో హ్యుందాయ్ క్రెట్ మోడల్ లాంచ్ చేసినప్పటి నుంచి 10లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ కంపెనీ ప్రకారం.. దేశీయ మార్కెట్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక క్రెటా మోడల్‌ను విక్రయిస్తోంది.

Read Also : Most Powerful Passports : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే.. టాప్ లిస్టులో ఫ్రాన్స్.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?

దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజు ఎస్‌యూవీ కాకుండా, హ్యుందాయ్ క్రెటా భారత్ నుంచి 2లక్షల 80వేల యూనిట్ల ఎగుమతులను నమోదు చేసింది. హ్యుందాయ్ క్రెటా భారతీయ కస్టమర్లను భారీగా ఆకట్టుకుంది. భారతీయ రోడ్లపై ఒక మిలియన్ క్రెటా ఎస్‌యూవీలతో క్రెటా బ్రాండ్ వివాదరహిత ఎస్‌యూవీగా తన వారసత్వాన్ని పునరుద్ఘాటించిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ అన్నారు. క్రెటాపై కస్టమర్‌లు ఆదరణ, విశ్వాసానికి కృతజ్ఞుతలు ఆయన తెలిపారు.

విప్లవాత్మక సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో అగ్రగామిగా పరిశ్రమలోని విభాగాలలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుతూ, బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం కొనసాగిస్తూనే ఉంటామని తరుణ్ గార్గ్ చెప్పారు. 2023లో హ్యుందాయ్ వార్షిక దేశీయ పరిమాణంలో క్రెటా 26.1శాతం అందించింది . గత సంవత్సరం మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో 30.7శాతం వాటాను కలిగి ఉంది.

60 కన్నా ఎక్కువ బుకింగ్స్.. క్రెటా ధర ఎంతంటే? :
ప్రస్తుతం భారత మార్కెట్లో సెకండ్ జనరేషన్ అవతార్‌లో అందిస్తోంది. గత నెలలో క్రెటా మోడల్ మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను అందుకుంది. కొత్త మోడల్ ఇప్పటికే 60వేల కన్నా ఎక్కువ బుకింగ్‌లను పొందింది. హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు ధర రూ. 10,99,900 నుంచి రూ. 20,14,900 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో అందుబాటులో ఉంది.

అంతేకాదు.. కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజీ ఆస్టర్‌లకు ప్రత్యర్థిగా కొనసాగుతోంది.
ఇంజన్ ఆప్షన్ల విషయానికొస్తే.. హ్యుందాయ్ క్రెటాలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.

1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ (115పీఎస్ 144ఎన్ఎమ్), 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ (160పీఎస్ 253ఎన్ఎమ్) 1.5-లీటర్ యూ2 సీఆర్‌డీఐ డీజిల్ (116పీఎస్ 250ఎన్ఎమ్) ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఏటీ అనే నాలుగు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

Read Also : Mitsubishi Comeback India : భారత్‌కు మళ్లీ ‘మిత్సుబిషి’ బ్రాండ్ వస్తోంది.. 30శాతం వాటా కొనుగోలుతో రీఎంట్రీకి రెడీ!

ట్రెండింగ్ వార్తలు