Mitsubishi Comeback India : భారత్‌కు మళ్లీ ‘మిత్సుబిషి’ బ్రాండ్ వస్తోంది.. 30శాతం వాటా కొనుగోలుతో రీఎంట్రీకి రెడీ!

Mitsubishi Comeback India : భారత మార్కెట్లోకి జపాన్ బ్రాండ్ మిత్సుబిషి రీఎంట్రీ ఇవ్వనుంది. టీవీఎస్ మొబిలిటీలో 30 శాతం కన్నా ఎక్కువ వాటాను మిత్సుబిషి కొనుగోలు చేయనున్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం.

Mitsubishi Comeback India : భారత్‌కు మళ్లీ ‘మిత్సుబిషి’ బ్రాండ్ వస్తోంది.. 30శాతం వాటా కొనుగోలుతో రీఎంట్రీకి రెడీ!

Mitsubishi To Make Comeback in India Set to Acquire 30 percent stake in TVS Mobility

Mitsubishi Comeback India : ప్రముఖ జపనీస్ బ్రాండ్ మిత్సుబిషి ఈ ఏడాది వేసవిలో భారత కార్ల విక్రయాల మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అదే నిజమైతే.. ఈసారి, కంపెనీ కార్ డీలర్‌షిప్‌లో కంపెనీ దాదాపు 30 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీవీఎస్ మొబిలిటీతో కూడా జపాన్ కార్ల తయారీ కంపెనీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

Read Also : Ather 450 EV Scooter : అన్ని రూ. 10 నాణేలు చెల్లించి.. లక్షల ఖరీదైన ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలు చేసిన కస్టమర్.. ఎక్కడంటే?

నిక్కీ ఆసియా వివరాల ప్రకారం.. మిత్సుబిషి కంపెనీ సుమారు 5 బిలియన్ నుంచి 10 బిలియన్ యెన్‌ల (33 మిలియన్ డాలర్ల నుంచి 66 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. పెట్టుబడిని ఖరారు చేసిన తర్వాత లేదా సంబంధిత సంస్థ నుంచి అనుమతి పొందిన అనంతరం మిత్సుబిషి దేశంలోని తమ డీలర్‌షిప్‌లను ప్రారంభించనుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలో భారత మార్కెట్లో పలు మోడల్స్ విక్రయించిన మిత్సుబిషి 2016లో ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

టీవీఎస్ మొబిలిటీతో మిత్సుబిషి డీల్ :
దేశవ్యాప్తంగా మొత్తం 150 అవుట్‌లెట్‌లను కలిగిన భారత మార్కెట్లో తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి మిత్సుబిషి టీవీఎస్ మొబిలిటీని ఉపయోగిస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి కార్ బ్రాండ్ కోసం ప్రత్యేక స్టోర్‌ను రూపొందించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తుంది. అయినప్పటికీ, టీవీఎస్ మొబిలిటీ ద్వారా నిర్వహించే హోండా కార్ల అమ్మకాలను పెంచడంపై డీలర్‌షిప్ ప్రాథమికంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో, మిత్సుబిషి దేశంలో జపాన్ కార్ల లైనప్‌లను మరింతగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ప్లాన్? :
ఈ డీలర్‌షిప్‌లు విస్తృత శ్రేణి బ్యాటరీతో నడిచే కార్లను కూడా అందిస్తాయి. దాంతో వినియోగదారులు ఎలక్ట్రానిక్ వాహనాలపై వైపు మొగ్గు చూపుతారు. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం మిత్సుబిషి ఆధారిత కంపెనీ ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించనుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్ సర్వీసులతో అపాయింట్‌మెంట్‌లను కూడా అందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. తద్వారా దేశ మార్కెట్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది.

Read Also : Most Powerful Passports : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే.. టాప్ లిస్టులో ఫ్రాన్స్.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?