ICICI Bank ‘Cardless EMI’, ప్రయోజనాలివే

  • Publish Date - November 20, 2020 / 03:19 AM IST

ICICI Bank introduces ‘Cardless EMI : కార్డు రహిత EMI సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ICICI వెల్లడించింది. ఈ సదుపాయం ద్వారా బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం పొందిన వినియోగదారులు వ్యాలెట్, కార్డులకు బదులు మొబైల్ ఫోన్, పాన్ లను ఉపయోగించి..నచ్చిన గ్యాడ్జెట్ లు, గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ప్రముఖ మర్చంట్ కామర్స్ ప్లాట్ ఫామ్ – పైన్ ల్యాబ్స్ తో బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది.



క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై లభించే ఈఎంఐ సదుపాయంతో వివిధ వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. దీనికి అదనపు సౌకర్యాన్ని కల్పించాలని, కార్డులు, వ్యాలెట్ లేకుండానే..లావాదేవీలు చేయవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు అన్ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ (Head- Unsecured Assets, ICICI Bank) సుదీప్తా రాయ్ వెల్లడించారు. ఇది చాలా సురక్షితమని, వినియోగదారులకు నూతన ఉత్సాహం ఇస్తుందన్నారు.



దీనివల్ల కలిగే ప్రయోజనాలు :
కార్డు ఉపయోగించకుండానే నో కాస్ట్ EMI సదుపాయం.
జీరో ప్రాసెసింగ్ ఫీజు.
డిజిటల్, కాంటాక్ట్ లెస్ విధానంలో ఉంటుంది.
వినియోగదారులు రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ముందస్తు అనుమతి పొందే అవకాశం.
వినియోగదారులు 3 నుంచి 15 నెలల వరకు తమకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు.



ఎలా పొందాలి :
నచ్చిన వస్తువులను స్టోర్ వద్ద ఎంచుకోవాలి.
‘Cardless EMI’ కు అనుకూలమని స్టోర్ ప్రతినిధికి తెలియచేయాల్సి ఉంటుంది.
బ్యాంకులో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్, పాన్ ఎంటర్ చేయాలి.
మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని పీఓఎస్ టెర్మినల్ లో ఎంటర్ చేయాలి.

అర్హత తెలుసుకోవడం ఎలా :

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కార్డ్ లెస్ ఈఎమ్ఐ తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి CF అని టైప్ చేసి 5676766 కు SMS పంపించాలి.