Income Tax Notice
Income Tax Notice : అసలే డిజిటల్ చెల్లింపుల యుగం.. నేటికీ చాలా మంది క్యాష్ ట్రాన్సాక్షను (Income Tax Notice) ఎక్కువగా చేస్తుంటారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ క్యాష్ పేమెంట్లు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. చాలా మంది ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా ఉండేలా క్యాష్ పేమెంట్లు కూడా చేస్తారు.
క్యాష్‌తో చిన్న షాపింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, 5 క్యాష్ పేమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ట్రాన్సాక్షన్ల విషయంలో ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిన వెంటనే మీకు ఐటీ నోటీసులు పంపవచ్చు. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
1- బ్యాంకు ఖాతాలో క్యాష్ క్రెడిట్ :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే.. ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.
ఈ నగదు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లలో క్రెడిట్ అయి ఉండవచ్చు. నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే.. డబ్బు ఎక్కడిదో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు.
2. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో క్యాష్ క్రెడిట్ :
ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఎలాంటి సమస్య ఉంటుందో ఫిక్స్‌డ్ డిపాజట్ల విషయంలో కూడా అదే జరుగుతుంది.
ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్‌డీలలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే.. ఆదాయపు పన్ను శాఖ డబ్బు మూలం గురించి ప్రశ్నించవచ్చు.
3. భారీగా ఆస్తి లావాదేవీలు :
మీరు ఆస్తిని కొనుగోలు చేస్తే.. రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ లావాదేవీ చేస్తే.. ప్రాపర్టీ రిజిస్ట్రార్ కచ్చితంగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఇంత పెద్ద లావాదేవీకి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ అడగవచ్చు.
4 : క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్లు :
మీ క్రెడిట్ కార్డ్ బిల్లు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. క్యాష్ రూపంలో చెల్లిస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఐటీ శాఖ మిమ్మల్ని అడగవచ్చు.
మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే.. మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు.
5 : షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లను కొనడం :
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్ల కొనుగోలు కోసం భారీ మొత్తంలో క్యాష్ చెల్లిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంది.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20 విడత డబ్బులు పడాలంటే ఆధార్‌తో e-KYC ఇలా చేయండి..!
ఒక వ్యక్తి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే.. దానికి సంబంధించి సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఇలాంటి సందర్భంలో మీరు క్యాష్ ఎక్కడి నుంచి తెచ్చారో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు.