PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20 విడత డబ్బులు పడాలంటే ఆధార్‌తో e-KYC ఇలా చేయండి..!
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత జూన్ చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈలోగా e-KYCని పూర్తి చేయండి.

PM Kisan Yojana
PM Kisan 20th Instalment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద అతి త్వరలో 20వ విడత విడుదల కానుంది. లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్-సీడెడ్ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు పడాలంటే ముందుగా e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ అంటే ఏమిటి? :
రైతుల కోసం పీఎం కిసాన్ పథకం కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హతగల రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ.2వేలు చొప్పున 3 వాయిదాలలో పంపిణీ చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.
రూ. 2వేలు పడేది ఎప్పుడంటే? :
ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదాలు విడుదల అవుతాయి. గత ఫిబ్రవరిలో 19వ విడత విడుదల అయింది. జూన్ చివరి నాటికి 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.
e-KYC తప్పనిసరిగా ఉండాలా? :
పీఎం కిసాన్ డబ్బులు రూ. 2వేలు పడాలంటే e-KYC తప్పనిసరి. పారదర్శకతతో పాటు అసలైన లబ్ధిదారుల గుర్తించడం, సరైన బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం ఈ నిబంధనలను తప్పనిసరి చేసింది.
పీఎం కిసాన్ ( PM Kisan) కోసం e-KYC ఇలా చేయండి :
- రైతులు ఈ కింది నాలుగు పద్ధతుల్లో e-KYCని పూర్తి చేయవచ్చు.
- OTP-ఆధారిత e-KYC
- పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్
- బయోమెట్రిక్ ఆధారిత ఈ-కెవైసీ
- కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), రాష్ట్ర సేవా కేంద్రాలు (SSK)
- ఫేస్ అథెంటికేషన్ ఆధారిత e-KYC
పీఎం కిసాన్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ యాక్సెస్ లేని వారు చేయొచ్చు.
ఆధార్ ఆధారిత OTP e-KYC ఎలా పూర్తి చేయాలి? :
- అధికారిక పోర్టల్ (https://pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
- టాప్ రైట్ కార్నర్‌లో ‘e-KYC’ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
- OTP వెరిఫికేషన్ తర్వాత e-KYC పూర్తవుతుంది.
ఫేస్ అథెంటికేషన్ e-KYC (మొబైల్ యాప్) ఎలా పూర్తి చేయాలంటే? :
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి (PM-Kisan) మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ RD యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- పీఎం కిసాన్ యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- లబ్ధిదారు స్టేటస్ కేటగిరీకి వెళ్లండి.
- e-KYC స్టేటస్ ‘No’ అని చూపిస్తే.. ‘e-KYC’పై క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్‌తో ఫేస్ స్కాన్ చేయాలి.
- ఫేస్ స్కాన్ తర్వాత e-KYC పూర్తయినట్టే.
e-KYC స్టేటస్ సాధారణంగా 24 గంటల్లోపు పోర్టల్‌లో అప్‌డేట్ అవుతుంది.