Income Tax : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించకతప్పదు!

Income Tax Deadlines : 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడిదారులు మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టాలి. గడవు తేదీలకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.

Income Tax deadlines

Income Tax Deadlines : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఆదాయపు పన్ను ఇంకా చెల్లించలేదా? పన్ను చెల్లింపులకు సంబంధించి తుది గడువు దగ్గరపడుతోంది. గడువు తేదీ వరకు ఆగే కన్నా ముందుగానే ఆదాయపు పన్ను చెల్లించడం పన్ను చెల్లింపుదారులకు చాలా ముఖ్యం.

Read Also : Crows Fall : ‘విరూపాక్ష’ సీన్ రిపీట్.. ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..? గాల్లో ఎగురుతూ టప్ మని కిందపడి కాకులు మృతి..!

అలా చేయకపోతే పన్ను ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. పెనాల్టీలు, రుసుములు లేదా జరిమానాలు కూడా చెల్లించాల్సి రావచ్చు. 2026 ఆర్థిక సంవత్సరం మరో 15 రోజుల్లో ముగియనుంది. మార్చి 31, 2025కి ముందు కొన్ని రోజుల్లో ముగియబోయే గడువులను ఓసారి లుక్కేయండి.

ఆదాయపు పన్ను కీలక గడువులివే :
2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు పెట్టుబడిదారులు మార్చి 31కి ముందు పెట్టుబడి పెట్టాలి. మార్చి 31 తర్వాత పెట్టుబడి పెట్టే పన్ను చెల్లింపుదారులు తదుపరి సంవత్సరం అంటే.. 2025-26లో మాత్రమే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. 80C, 80D, 80G వంటి వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు కొత్త పన్ను విధానంలో కాకుండా పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

2024-25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలంటే.. పన్ను ఆదా కోసం మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి నాల్గవ విడత ముందస్తు పన్ను చెల్లించడానికి మార్చి 15 చివరి తేదీ.

ముందస్తు పన్ను చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులు మార్చి 15 లోపు 100 శాతం బకాయిలను చెల్లించాలి. ఫిబ్రవరి, 2025 నెలకు సంబంధించిన TDS/TCSను చలాన్ ఇవ్వకుండానే చెల్లించినవాళ్లు ప్రభుత్వ కార్యాలయం ద్వారా ఫారమ్ 24Gని సమర్పించేందుకు వచ్చే శనివారం వరకు గడువు ఉంది.

Read Also : Best Mobiles 2025 : కొత్త ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

జనవరి 2025లో సెక్షన్ 194-IA, 194-IB కింద మినహాయించిన పన్నుకు టీడీఎస్ సర్టిఫికేట్ జారీ చేసే గడువు తేదీ మార్చి 17. ఫిబ్రవరిలో సెక్షన్ 194-IA, 194-IB కింద తగ్గించిన పన్నుకు సంబంధించి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను సమర్పించేందుకు చివరి తేదీ మార్చి 30 వరకు మాత్రమే. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి అప్‌డేట్ చేసిన ఆదాయ రిటర్న్‌ను మార్చి 31 వరకు సమర్పించవచ్చు.