ఒక ఉంగరంలో 7,801 వజ్రాలు.. హైదరాబాదీ గిన్నీస్ వరల్డ్ రికార్డు!

  • Publish Date - October 25, 2020 / 07:00 PM IST

7,801 diamonds in Ring : ఒక్క ఉంగరంలో 7,801 వ‌జ్రాలు పొందుపరిచి భారత నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు. జ్యుయలరీ వ్యాపారుల్లో అందరికి సుపరిచితుడు కూడా. ఆయనే.. Hallmark Jewellers వ్యవస్థాపకులు కొట్టి శ్రీకాంత్ (Kotti Srikanth) ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ పేరుతో ఈ ఉంగరాన్ని రూపొందించారు.



అరుదైన పుష్పం బ్రహ్మ కమలం ఆకృతిలో వజ్రాలు పొదిగిన ఈ డైమండ్ రింగ్‌ గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. సెప్టెంబర్ 2018లోనే ఈ ఉంగరాన్ని వజ్రాలతో డిజైన్ చేయడం మొదలుపెట్టారు.

అది కూడా కేవలం పెన్సిల్ డ్రాయింగ్ తోనే.. భారత సాంప్రదాయ దేవాదారు పుష్పంగా పేరొందిన బ్రహ్మ కమలం మాదిరిగా వజ్రాలతో పొదిగిన ఉంగారాన్ని సృష్టించినట్టు శ్రీకాంత్ వివరించారు.



డిజైన్ పూర్తిన వెంటనే Hallmark Jewellers బృందం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (CAD) ద్వారా ఉంగారాన్ని తయారుచేయాలంటే ఎన్ని వజ్రాలు అవసరమో అలానే డిజైన్ చేసింది.

6 లేయర్లతో ఉన్న వజ్రాల ఉంగరంలో ప్రతి లేయర్‌లో 8 రేకులుంటాయి. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 45 రోజులు సమయం పట్టింది.



మార్చి 2019లో ఈ వజ్రాల బ్రహ్మ కమల ఉంగారాన్ని రూపొందించారు. మే 2019 లో ఖచ్చితమైన వజ్రాల అవసరాన్ని పొందిన తర్వాత, వజ్రాల సేకరణను ప్రారంభించారు.

ఆగస్టు నెలలో ఉంగరాన్ని ఒక రూపానికి తీసుకొచ్చామని, హైదరాబాద్ నగరంలోని తమ షాపులోనే చివరిగా మెరుగులు దిద్దామని శ్రీకాంత్ తెలిపారు. 2010లోనే కొట్టి శ్రీకాంత్ Hallmark Jewellers స్థాపించగా.. ఆ తర్వాత డైమండ్ జ్యులరీ వైపు ఆసక్తి చూపారు. అప్పటినుంచి గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నాలు చేపట్టారు.



గిన్నీస్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని పంపించారు. వెరిఫికేషన్ ప్రక్రియ అనేక రౌండ్లు జరిగింది. ఒక రింగులో ఎక్కువ డైమండ్స్ పొదగడంతో గిన్నీస్ రికార్డ్ ఈ ఉంగరానికి దక్కింది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు