Elon Musk-Piyush Goyal : మంత్రి పీయుష్ గోయల్‌తో ఎలన్ మస్క్ భేటీపై ఉత్కంఠ .. భారత్‌లోకి టెస్లా ఎంట్రీ షురూ..?

టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?

Tesla Elon Musk..Piyush Goyal  Meet

Tesla Elon Musk..Piyush Goyal  Meet : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. గత జూన్ లో ప్రధాని మోదీని ఎలన్ మస్క్ కలిశారు. భారత్ లో తాము పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. ప్రధానితో భేటీ తరువాత అమెరికాలో మంత్రి పీయుష్ గోయల్ తో మస్క్ భేటీ కానున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇక టెస్లా భారత్ లోకి అడుగు పెట్టటానికి వీరి భేటీ నాంది పలనుందని తెలుస్తోంది. వీరి మధ్య చర్చలు ఇక భారత్ లో టెస్లా ఫ్యాక్టరి స్థాపనకు రంగం సిద్ధమయ్యే అవకాశాలున్నాయని భావించవచ్చు..

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ లో ప్రకారం..ఎలన్ మస్క్ మంత్రి పీయూష్ గోయల్ తో వచ్చే వారమే అమెరికాలో భేటీ కానున్నారు.  గత జూన్ లో ప్రధాని మోదీతో మస్క్ భేటీ తరువాత గోయల్ -మ‌స్క్ సమావేశం అత్యంత హైప్రొఫైల్ గా ఉండనుందని రాయిటర్స్ పేర్కొంది. టెస్లా దక్షిణాసియాలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. దీని కోసం మస్క్ భారత్ ను ఎంచుకున్నారని ఇక్కడ పెట్టుబడుల కోసమే మోదీతో భేటీ..తాజాగా గోయల్ తో భేటీ అని రాయిటర్స్ ఉటంకించింది.

Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

ఎలాన్ మ‌స్క్ కు చెందిన టెస్లా భారత్ లోకి ప్రవేశించడానికి అనుమతులను క్రమబద్ధీకరించడానికి మోదీ ప్రభుత్వం కూడా సిద్దంగా ఉంది. దీంట్లో భాగంగా ఈ కొత్త ఈవీ విధానంపైనే ప్రధాన మంత్రి కార్యాలయం  వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపింది. కానీ దిగుమతి సుంకం తగ్గింపుకు ఒత్తిడి ఉంటం వల్ల ఆ ప్రభావం దేశీయ ఈవీ కంపెనీలపై ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనావేస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

కాగా..2024 ప్రారంభంలోనే దీనికి సంబంధించి అనుమతులు పొందాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో టెస్లా కార్ల తయారి ఫ్యాక్టరీ ఏర్పాటు, 24,000 డాలర్ల కారును తయారు చేయడం, దేశీయంగా పరికరాల కొనుగోలు, విడిభాగాలను సోర్సింగ్..ఛార్జింగ్‌ మౌలిక వసతుల వంటివి ఏర్పాటుపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చించనున్నట్లుగా సమాచారం. ఆటోమొబైల్ కంపెనీలు స్థానిక తయారీకి కట్టుబడి ఉంటే 100 శాతం నుంచి 15 శాతం తక్కువ ట్యాక్స్ తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతించే భారతదేశ కొత్త ప్రతిపాదిత విధానం గురించి కూడా వారు చర్చించే అవకాశం ఉంది.

Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

కాగా..దక్షిణాసియా మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ కోసం కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా మొదట్లో 2021 లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు యత్నించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు 100శాతం దిగుమతి ట్యాక్స్ తగ్గించాలని అధికారులను కోరింది. కానీ.. కంపెనీ మొదట స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని అధికారులు తెలియజేయడంతో గత సంవత్సరం జరిగిన ఈ చర్చలు  విఫలమయ్యాయి. తాజాగా మరోసారి టెస్లా భారత్ ఎంట్రీ కోసం మంత్రి పీయుష్ గోయల్ తో భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.