మీకు తెలుసా.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు మారాయి

భారతీయ రైల్వే.. జనవరి 1, 2020 నుంచి రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను మార్చింది. ఇప్పుడు కొత్త హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయ రైల్వేకు హెల్ప్ కోసం ఫోన్ చేయాలంటే వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. వాటన్నింటికి బదులు కేవలం రెండు హెల్ప్ లైన్ నెంబర్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే.
రైలు ఎంక్వైరీ కోసం 139, భద్రత కోసం 182 నెంబర్లు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటినుంచి ప్రయాణికులు ఈ నెంబర్లకు మాత్రమే కాల్ చేయాలి. అంతేకాదు ఈ నెంబర్లకు SMS కూడా చేయొచ్చు. ఇక ఇప్పటి వరకు పనిచేస్తున్న జనరల్ కంప్లైంట్ నెంబర్ 138, కేటరింగ్ సర్వీస్ నెంబర్ 1800111321, విజిలెన్స్ నెంబర్ 152210, యాక్సిడెంట్ సేఫ్టీ నెంబర్ 1072, క్లీన్ మై కోచ్ నెంబర్ 138, SMS కంప్లైంట్ నెంబర్ 9717630982 పనిచేయవు.
ఇకపై మీరు భారతీయ రైల్వేను సంప్రదించాలంటే 139, 182 నెంబర్లకు మాత్రమే కాల్ లేదా SMS చేయాలి. మీకు ఎలాంటి సేవలు కావాలన్న ఇవే నెంబర్లలో సంప్రదించాలి. ఒక్కో సర్వీస్ కు ఒక్కో ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, పదేపదే గూగుల్ లో వెతకాల్సిన పని లేకుండా కేవలం ఈ రెండు నెంబర్లు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.
“हर सफर होगा सुरक्षित और फाइन,
जब होगा साथी वन थ्री नाइन “यात्रा के दौरान किसी भी मदद या जानकारी के लिए अलग अलग नंबर याद रखने का झंझट अब खत्म।
याद रखें अब सिर्फ 139 नंबर पर ही सब कुछ उपलब्ध हो रहा है। pic.twitter.com/O3oibifUaf— Ministry of Railways (@RailMinIndia) January 1, 2020