Best Selling Cars 2026 : SUVల హవా మధ్య సెడాన్ సత్తా.. మే అమ్మకాల్లో నంబర్‌వన్‌గా మారుతి డిజైర్.. ఈ కారును తెగ కొనేశారు!
Best Selling Cars 2026 : మే 2026 కార్ల అమ్మకాలలో మారుతి సుజుకి డిజైర్ టాప్ ప్లేసులో నిలిచింది. ఈ నెలలో 24,546 యూనిట్లు అమ్ముడయ్యాయి. పలు సెగ్మెంట్లలో ఎస్‌యూవీలు ఆధిపత్యం ఉన్నా ఈ సెడాన్ గతేడాదితో పోలిస్తే 36 శాతంతో దూసుకుపోయింది.
Best Selling Cars ( Image Credit : AI )
- మే 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి డిజైర్
- మొత్తం 24,546 యూనిట్ల అమ్మకాలతో డిజైర్ అగ్రస్థానం
- సెడాన్ జోరు.. మార్కెట్లో SUVల ఆధిపత్యానికి బ్రేక్..
Best Selling Cars 2026 : మే నెలలో కార్ల అమ్మకాలు దుమ్మురేపాయి. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUVల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ఎవరూ ఊహించని రీతిలో మారుతి సుజుకి డిజైర్ టాప్ ప్లేసులో నిలిచింది. మే 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. మార్కెట్లో ఎస్ యూవీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటిది సెడాన్ టాప్ పొజిషన్ దక్కించుకోవడం ఆటో ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఫ్యామిలీ కస్టమర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్, కొత్త జనరేషన్ ఫీచర్లుతో (Best Selling Cars 2026) డిజైర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. మే 2026లో మారుతి డిజైర్ మొత్తం 24,546 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే.. 36 శాతం వృద్ధిని సాధించింది.
SUV మోడల్స్ దూసుకుపోతున్న మార్కెట్లో కూడా ఈ సెడాన్పైనే ఎక్కువ ఆసక్తి కనిపించింది. మారుతి 1.2-లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంది. తక్కువ నిర్వహణ ఖర్చులతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
ఫ్రాంక్స్, ఎర్టిగా మారుతి అమ్మకాల జోరు.. :
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 20,686 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. మారుతి నెక్సా లైనప్‌లో ముందంజలో నిలిచింది. నాచురల్లీ ఆస్పిరేటెడ్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. పెట్రోల్, CNG వెర్షన్లలో కూడా లభిస్తోంది. ఈ మోడల్ కూపే-స్టయిల్ SUV డిజైన్, సిటీలో అమ్మకాలు ఏడాదికి 52 శాతం పెరిగాయి.
మూడో స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా 20,350 యూనిట్లతో ఎంపీవీ కేటగిరీలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ 3 వరుసల మోడల్ ఫ్యామిలీ, కమర్షియల్ కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పెట్రోల్ CNG ఆప్షన్లతో వస్తుంది. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదు చేసింది.
భారీగా టాటా పంచ్, నెక్సాన్ SUV అమ్మకాలు :
మే 2026లో ఈవీ వెర్షన్‌తో సహా 20,208 యూనిట్ల అమ్మకాలతో పంచ్ రేంజ్ టాటా మోటార్స్ 4వ స్థానంలో నిలిచింది. ఈ మైక్రో-SUV కాంపాక్ట్ సైజు 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ సపోర్టు అందిస్తుంది. ఈ మోడల్ వార్షికంగా 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.
19,100 యూనిట్లతో టాటా నెక్సాన్ 5వ స్థానంలో నిలిచింది. పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఇదొకటి. వైడ్ ఇంజన్ రేంజ్ ఫీచర్లతో ఏడాదికి 46 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాప్ 10లో బలెనో అగ్రస్థానం :
18,396 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకి బాలెనో టాప్ ప్లేసులో నిలిచింది. మే 2026 టాప్ 10 లిస్టులో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి. గతేడాదితో పోలిస్తే.. 58 శాతం వృద్ధిని నమోదు చేసింది. టాప్ 10 కార్లలోకెల్లా ఇదే అత్యధికం. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నెక్సా నెట్‌వర్క్‌లో దూసుకుపోతోంది. హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ టెక్ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
Read Also : Blaupunkt QLED Smart TV : ఇంట్లోనే థియేటర్ ఫీల్.. సరసమైన ధరలో కొత్త QLED స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్..!
వ్యాగన్ఆర్, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లకు భారీ డిమాండ్ :
మారుతి సుజుకి వాగన్ఆర్ 18,076 యూనిట్ల అమ్మకాలతో స్థిరంగా కొనసాగుతోంది. టాల్-బాయ్ డిజైన్, క్యాబిన్ స్పేస్ పరంగా పెట్రోల్, CNG ఫార్మాట్లలో ఆకర్షిస్తూనే ఉంది. ఈ మోడల్ వార్షికంగా 30 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మారుతి సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్లతో 8వ స్థానంలో నిలిచింది. సరికొత్త స్టైలింగ్, ఫ్యూయిల్, కొత్త జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. 24 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాప్ 10లో స్కార్పియో, క్రేటా :
స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ కలిపి మహీంద్రా స్కార్పియో 15,774 యూనిట్ల అమ్ముడయ్యాయి. ఈ ఎస్యూవీ సెమీ-అర్బన్, గ్రామీణ మార్కెట్లలో దూసుకుపోతోంది. గతేడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధి కనిపించింది.
ఈ లిస్టులో హ్యుందాయ్ క్రెటా మోడల్ 15,253 యూనిట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈ మోడల్ ఇప్పుడు అప్డేట్ స్టైలింగ్, అడాస్ ఫీచర్లు, అప్ గ్రేడ్ క్యాబిన్ లేఅవుట్‌తో వస్తుంది. ఇందులో పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం వృద్ధిని సాధించింది.
మే 2026 సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలలో డిమాండ్ దాదాపు సమానమే. అన్ని సెగ్మెంట్లలో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలవగా టాటా, మహీంద్రా హ్యుందాయ్ ఎస్యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తున్నాయి.
