India Semiconductor Industry ( Image Source : Google )
India Semiconductor Industry : భారత్‌లో ప్రతిష్టాత్మకమైన సెమీకండక్టర్ పరిశ్రమ రానున్న రోజుల్లో తీవ్ర కొరతను ఎదుర్కొనుంది. దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ ఎండ్ డీ), డిజైన్, తయారీతో పాటు అధునాతన ప్యాకేజింగ్ డొమైన్‌లలో 2027 నాటికి 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికిపైగా నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారుల డి-రిస్కింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ లక్ష్యాలతో భారత్ ప్రపంచ సెమీకండక్టర్ తయారీలో కీలక స్థానాన్ని ఆక్రమించింది.
గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ మార్కెట్లో గణనీయమైన భాగాన్ని పొందేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని అంచనా వేస్తోంది. ఈ విస్తరణలో 2025-2026 నాటికి సుమారు 1 మిలియన్ ప్రపంచ ఉద్యోగాలను సృష్టించాలని భావిస్తోంది. భారత్ విస్తృత ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇప్పటికే, ప్రభుత్వం 76వేల కోట్ల సెమీకండక్టర్ ప్రొత్సాహక పథకంలో భాగంగా నాలుగు ప్రాజెక్టులను కూడా ఆమోదించింది.
ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ESSC) ప్రస్తుతం నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పథకం కింద వివిధ స్థాయిల్లోఎంట్రీ-లెవల్ నైపుణ్యాల కొరతను పరిష్కరించేందుకు 35కి పైగా అప్రెంటిస్‌షిప్ కోర్సులను అందిస్తోంది. ఈ గ్యాప్‌ని పరిష్కరించడానికి టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ప్రముఖులతో సహకరిస్తోంది.
2024 నాటికి 91,948కి పెరిగిన అప్రెంటిస్‌షిప్‌లు :
టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ సీఈఓ రమేష్ అల్లూరి రెడ్డి భారత్‌లో ఉపాధిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మూడు సెమీకండక్టర్ ప్లాంట్‌లలో 15 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య 2019-20లో 7,517 నుంచి 2023-24 నాటికి 91,948కి పెరిగిందని, 12.2 రెట్లు పెరిగిందని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ తెలిపారు.
భారత్‌లో సెమీకండక్టర్ తయారీ సౌకర్యాలను స్థాపించే కంపెనీలకు పీఎల్ఐ స్కీమ్ మాత్రమే 1.7 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక ప్యాకేజీని అందిస్తుంది. ఏఐ ఆధారిత టెక్నాలజీలోని పురోగతితో సెమీకండక్టర్ పరిశ్రమలో కార్యకలాపాల వైపు దేశాన్ని నడిపిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఏఐ-ఆధారిత చిప్ డిజైన్, స్మార్ట్ తయారీ ఏఐ, ఐఓటీ, 5జీలో నైపుణ్యం కలిగిన నిపుణుల డిమాండ్ మరింత పెరుగనుందని చెప్పారు. ఏఐ కార్యకలాపాల కోసం డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌లు, శిక్షణా కార్యక్రమాల ద్వారా సమర్థులైన నిపుణుల అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారత్ సెమీకండక్టర్ రంగం 2030 నాటికి 100 బిలియన్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనాలు సూచిస్తున్నాయి. ఇటీవల, అనేక కాలేజీలకు అవసరమైన పాఠ్యాంశాలను అందించేందుకు రెండు కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేశాయి. గత ఏడాదిలో 300 కన్నా ఎక్కువ ప్రముఖ భారతీయ కాలేజీలు స్పెషలైజ్డ్ సెమీకండక్టర్ కోర్సులను ఆఫర్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని నివేదిక పేర్కొంది.
Read Also : Yamaha Fascino S Launch : సెక్యూరిటీ ఫీచర్లతో యమహా ఫాసినో S స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?