Infinix Hot 50 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలివే!

Infinix Hot 50 Pro Launch : ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో బ్యాక్ కెమెరా సెటప్‌లో 50ఎంపీ హెచ్ఐ-5022క్యూ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ షూటర్ ఉన్నాయి.

Infinix Hot 50 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలివే!

Infinix Hot 50 Pro With MediaTek Helio G100 So Launched

Updated On : October 23, 2024 / 6:15 PM IST

Infinix Hot 50 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనా ట్రాన్సిషన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని బ్రాండ్ లేటెస్ట్ 4జీ ఆఫర్‌గా గ్లోబల్ మార్కెట్‌లలో ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో లాంచ్ చేసింది. కొత్త హాట్ సిరీస్ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. మీడియాటెక్ హెలియో జీ100 ఎస్ఓసీతో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టరేజీతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ వాటర్, ధూళి నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. 50ఎంపీ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో ధర, సేల్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. గ్లేసియర్ బ్లూ, స్లీక్ బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ సిమ్ (నానో) ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5పై రన్ అవుతుంది. 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+(1,080×2,436 పిక్సెల్‌లు) అమోల్డ్ ఐపీఎస్ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లేను గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, 1,800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సెల్ఫీ షూటర్ కోసం హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హెలియో జీ100 ఎస్ఓసీతో రన్ అవుతుంది. దాంతో పాటు 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ స్టోరేజీని 2టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, మెమరీని వాస్తవంగా 16జీబీ వరకు విస్తరించవచ్చు.

ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో బ్యాక్ కెమెరా సెటప్‌లో 50ఎంపీ హెచ్ఐ-5022క్యూ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లు 8ఎంపీ కెమెరా ద్వారా ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రోలో కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.4, ఎన్‌ఫీసీ, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై ఉన్నాయి.

ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు ఇ-కంపాస్, జి-సెన్సార్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డీటీఎస్ సౌండ్ హై-రెస్ ఆడియోకు సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 50ప్రో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.4ఎమ్ఎమ్ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Paytm UPI Users : పేటీఎంకు భారీ ఊరట.. 8 నెలల నిషేధం తర్వాత కొత్త యూపీఐ యూజర్లకు అనుమతి..!