Infinix Note 40 Racing Edition : ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?
Infinix Note 40 Racing Edition : ఈ ఫోన్ స్ట్రీమ్‌లైన్డ్ వింగ్ మోడల్ బీఎండబ్ల్యూ ఎమ్ పవర్ త్రివర్ణ పీసీ ప్లస్ పీఎమ్ఎమ్ఎ ఆర్గానిక్ గ్లాస్ మెటీరియల్‌ల వాడకం ద్వారా హై-గ్లాస్ ఎండ్ కలిగి ఉంది.

Infinix Note 40 Racing Edition launched in India, price starts at Rs 15,999
Infinix Note 40 Racing Edition : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త నోట్ 40 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. వార్షికోత్సవ వేడుక సందర్భంగా నోట్ 40 సిరీస్‌కి ఈ సరికొత్తగా యాడ్ చేసింది. బీఎండబ్ల్యూ గ్రూప్ కంపెనీ అయిన డిజైన్ వర్క్స్‌తో వస్తుంది. రేసింగ్ ఎడిషన్ ఫార్ములా 1 రేసింగ్ స్పీడ్‌తో వస్తుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. ఆగస్ట్ 26, 2024 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ గ్లాస్ ఫినిషింగ్, ఐకానిక్ ఎఫ్1 రేసింగ్ లోగో నుంచి డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్ట్రీమ్‌లైన్డ్ వింగ్ మోడల్ బీఎండబ్ల్యూ ఎమ్ పవర్ త్రివర్ణ పీసీ ప్లస్ పీఎమ్ఎమ్ఎ ఆర్గానిక్ గ్లాస్ మెటీరియల్‌ల వాడకం ద్వారా హై-గ్లాస్ ఎండ్ కలిగి ఉంది. ఈ డిజైన్ సిల్వర్ లోగో, యూవీ ట్రాన్స్‌ఫర్ మెథడ్‌తో అప్‌గ్రేడ్ అవుతుంది. డైనమిక్, ఆధునిక రూపాన్ని ఇస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌లను కస్టమ్ రేసింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్‌లు, ఐకాన్‌తో పర్సనలైజ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 40 స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ మీడియాటెక్ డీ7020 5జీ ప్రాసెసర్ ద్వారా అందిస్తుంది. మృదువైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ జీజీ5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, నోట్ 40ప్రో ప్లస్ 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజీతో వస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియులకు ఫోన్ 108ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 32ఎంపీ అల్ట్రా-క్లియర్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. నోట్ 40 రేసింగ్ ఎడిషన్‌లో సహజమైన నోటిఫికేషన్‌లకు ఏఐ యాక్టివ్ హాలో లైటింగ్, ఆడియోకు జేబీఎల్ ద్వారా సౌండ్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లు, కస్టమైజడ్ ఛార్జింగ్‌కు 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్ ప్యాడ్, మ్యాగ్‌కేస్‌తో వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జింగ్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
అయితే, నోట్ 40ప్రో 5జీ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 5000mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు మోడల్‌లు ఇన్ఫినిక్స్ చీతా ఎక్స్1 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. రెండు ప్రధాన అప్‌డేట్స్, మూడు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి. విలైఫ్ యాప్ ద్వారా స్మార్ట్ ఐఆర్ కంట్రోల్, కీ, కార్డ్ నిర్వహణకు ఎన్ఎఫ్‌సీ, ఐపీ53 స్ప్లాష్‌ప్రూఫ్ రేటింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ ఆగస్టు 26, 2024 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. నోట్ 40ప్రో 5జీ ఫోన్ ధర రూ. 15,999 కాగా, నోట్ 40ప్రో ప్లస్ 5జీ ధర రూ. 18,999కు పొందవచ్చు. కస్టమర్‌లు 3 నెలలు లేదా 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లతో సహా ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను కూడా పొందవచ్చు.
Read Also : Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్‌తో మిస్టీరియస్ మహిళకు లింకేంటి? ఇంతకీ, ఎవరీ జూలీ వావిలోవా?