Infnix Zero Flip Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ మడతబెట్టే ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర, లాంచ్ ఆఫర్లు ఇవే..!
Infnix Zero Flip Sale : ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ వేరియంట్ ధర రూ. 49,999కు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఫోల్డబుల్ ఫోన్‌ను ధర రూ. 44,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Infnix Zero Flip goes on sale in India today
Infnix Zero Flip Sale Offers : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇన్ఫినిక్స్ ఫోల్డబుల్ ఫోన్ సేల్ మొదలైంది. ట్రాన్సిసన్ సబ్-బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ ఇదే.. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 44,999 ధరతో అందుబాటులో ఉంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో విక్రయిస్తోంది. ఈ ధరలో కంపెనీ నుంచి అత్యంత చౌకైన ఫ్లిప్ ఫోన్ ఇదే.. అదేవిధంగా, మోటోరోలా రెజర్ 50 దాదాపు రూ. 50వేల ధరతో అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ధర, లాంచ్ ఆఫర్‌లు :
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ సింగిల్ 8జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999కు అందిస్తోంది. అయితే, ఈ ప్రారంభ బ్యాంక్ ఆఫర్‌లతో ఫోల్డబుల్ ఫోన్‌ను ధర రూ. 44,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. జీరో ఫ్లిప్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విక్రయానికి రానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్స్ :
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో 6.9-అంగుళాల 120Hz ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 2160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 100శాతం పీ3 కలర్ గ్యామట్‌తో పాటు 3.64 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. జీరో ఫ్లిప్ స్క్రీన్‌ను 30 డిగ్రీల నుంచి 150 డిగ్రీల మధ్య ఎక్కడైనా ఎడ్జెస్ట్ చేయవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 400,000 ఫోల్డ్‌లను తట్టుకోగలదని ఇన్ఫినిక్స్ పేర్కొంది.
మీడియాటెక్డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 6ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా మాలి జీ-77 ఎంసీ9 జీపీయూతో వస్తుంది. 8జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 512జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా విభాగంలో ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఎక్స్‌టీరియర్ స్క్రీన్‌పై డ్యూయల్ 50ఎంపీ కెమెరాలతో వస్తుంది.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన ప్రైమరీ లెన్స్, 114-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 60fps వద్ద 4కె వీడియోలను రికార్డ్ చేయగల 50ఎంపీ ఇంటర్నల్ కెమెరా కూడా ఉంది. ఇన్ఫినిక్స్ ఎక్స్ఓఎస్ 14.5 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతున్న జీరో ఫ్లిప్ భవిష్యత్తులో రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, మూడు ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,720mAh బ్యాటరీని కలిగి ఉంది.