Apple iPhone 15 : అమెజాన్ రక్షాబంధన్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 15పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ధర రూ. 45వేల లోపే..!
Apple iPhone 15 : అమెజాన్‌లో ఐఫోన్ 15పై అద్భుతమైన ఆఫర్.. రక్షాబంధన్ ముందుగానే ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 15 తక్కువ ధరకే లభిస్తోంది.

iPhone 15 sale
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అదిరే న్యూస్.. ఐఫోన్ 15 మోడల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ రక్షా బంధన్ పండగకు ముందుగానే ఐఫోన్ 15 కొనుగోలుపై (Apple iPhone 15) భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే..
ఐఫోన్ 15ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో లక్షలాది మంది కస్టమర్ల కోసం ఐఫోన్ 15 తగ్గింపు ధరకే అందిస్తోంది. ఐఫోన్ 15 హై పర్ఫార్మెన్స్ చిప్‌సెట్‌తో 2023లో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై అందించే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 15 డిస్కౌంట్ (Apple iPhone 15) :
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 మోడల్ 128GB ధర రూ.69,900కి లభ్యమవుతుంది. 12 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర కేవలం రూ.61,400కి తగ్గింది. ఈ ఆఫర్ ద్వారా ఏకంగా రూ.8వేల కన్నా ఎక్కువ ఆదా చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో రూ.1,842 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఐఫోన్ 15 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.49,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ రూ.15వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటే ఐఫోన్ 15 కేవలం రూ.44,600కే పొందవచ్చు. అయితే, అసలు ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఫిజికల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు (Apple iPhone 15) :
- అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్
- డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP68 రేటింగ్
- డాల్బీ విజన్ సపోర్ట్, 6.1-అంగుళాల సూపర్ రెటినా OLED డిస్‌ప్లే
- సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో డిస్‌ప్లే ప్రొటెక్షన్
- ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్
- 6GB ర్యామ్, 56GB వరకు స్టోరేజీ
- బ్యాక్ సైడ్ 48MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా
- 3349mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు