iPhone 16 Pro Series
iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అతి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ఆపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో (iPhone 16 Pro) తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ రెండు ఐఫోన్లపై లిమిటెడ్ ఆఫర్‌లను అందిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు. ఇంకా, తక్కువ ధరకు సొంతం చేసుకోవాలంటే.. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనుగోలుపై పాత ఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్రో సిరీస్ ఆఫర్లు :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ హ్యాండ్‌సెట్‌పై 8 శాతం తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ ధర ధర రూ. 1,09,900కు తగ్గింది. రూ. 1,29,900కు రిటైల్ అయ్యే 256GB వేరియంట్‌ను రూ. 1,22,900కు కొనుగోలు చేయవచ్చు. 5 శాతం ధర తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్ 4 బ్లాక్ టైటానియం, డెసర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ ఆప్షన్‌లతో వస్తుంది.
ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB వేరియంట్ రూ. 1,32,900కు లిస్ట్ అయింది. 8 శాతం తగ్గింపుతో రిటైల్ ధర రూ. 1,44,900 నుంచి తగ్గింది. కొనుగోలుదారులు 512GB, 1TB మోడళ్లను కూడా కొనుగోలు చేయవచ్చు. మొదట రూ. 1,64,900, రూ. 1,84,900 ధరతో ఉండగా తగ్గింపు తర్వాత వరుసగా రూ. 1,57,900, రూ. 1,77,900 ధరలకు కొనుగోలు చేయవచ్చు.
డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్‌పై రూ. 48,150 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ. 4వేల వరకు 5 శాతం తగ్గింపు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు.