Oppo Reno 14 5G Series : ఒప్పో రెనో 14 5G సిరీస్ వచ్చేస్తోందోచ్.. కెమెరా ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?
Oppo Reno 14 5G Series : ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. ఒప్పో రెనో 14 5G సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర, లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

Oppo Reno 14 5G Series
Oppo Reno 14 5G Series : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఒప్పో రెనో 14 5G ఫోన్ వచ్చేస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లతో ఒప్పో రెనో 14 5G సిరీస్ గత (Oppo Reno 14 5G Series)నెలలో చైనాలో లాంచ్ అయింది. మలేషియాలో ఒప్పో రెనో 14 5G, రెనో 14 ప్రో 5G లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. త్వరలో భారత మార్కెట్లో ఒప్పో రెనో 14 5G సిరీస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనుంది. ఒప్పో రెనో 14 5G సిరీస్ చైనా వేరియంట్లలో 50MP సెల్ఫీ షూటర్లు, 50MP రియర్ కెమెరాలు ఉన్నాయి.
జూలై 1న ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ :
ఒప్పో రెనో 14 5G, రెనో 14 ప్రో 5G జూలై 1న సాయంత్రం 6 గంటలకు (IST మధ్యాహ్నం 3:30 గంటలకు) మలేషియాలో లాంచ్ కానుందని ఒప్పో ఫేస్‌బుక్ X హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. (OOO) మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ లైనప్ ఆవిష్కరించనుంది. వివో మలేషియా వెబ్‌సైట్ ద్వారా దేశంలో ప్రీ-ఆర్డర్ కోసం హ్యాండ్‌సెట్‌లు అందుబాటులో ఉంటాయి.
ఒప్పో రెనో 14 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు RM 200 (దాదాపు రూ. 4వేల) వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, RM 2,396 (దాదాపు రూ. 45వేలు) వరకు విలువైన గిఫ్ట్స్ అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్లలో ఒప్పో రెనో 14 5G సిరీస్ ఇండియా లాంచ్ కోసం ఒక స్పెషల్ వెబ్‌పేజీని క్రియేట్ చేసింది. ఒప్పో ఇప్పటికే ఈ లైనప్‌ను త్వరలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
ఒప్పో రెనో 14 5G సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఒప్పో రెనో 14 5G, రెనో 14 ప్రో 5G ఫోన్లు గత మేలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ భారతీయ వేరియంట్లు చైనీస్ మోడల్స్ మాదిరిగానే స్పెసిఫికేషన్లు కలిగి ఉండొచ్చు. రెనో 14 చైనీస్ వేరియంట్ 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC కలిగి ఉంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రెనో 14 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల OLED స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీ కలిగి ఉంది. ఒప్పో రెనో 14 5G సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్‌పై రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, గరిష్టంగా 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇందులో 50MP బ్యాక్ కెమెరా యూనిట్లు, 50MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.