iPhone 16 Pro : ఈ కొత్త ఆపిల్ ఐఫోన్ చాలా చీప్ గురూ.. తక్కువ ధరకే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్..!

iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రో సరసమైన ధరలో లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ.14,900 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro

iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 16ప్రో ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ ఈ ప్రీమియం ఐఫోన్ 16ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఫస్ట్ టైమ్ ఐఫోన్‌కు మారుతున్నారా?

Read Also : EPFO : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఇకపై మీ పీఎఫ్ విత్‌డ్రాకు క్యాన్సిల్ చెక్ అక్కర్లేదు.. కేవలం 2 రోజుల్లోనే డబ్బులు పడతాయి..!

అయితే, ఈ డీల్ మీకోసమే. ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఐఫోన్ 16ప్రో కొనుగోలుపై ఏకంగా రూ. 14,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇలాంటి డీల్స్ సాధారణంగా ఎక్కువ కాలం ఉండవని గమనించాలి. ముఖ్యంగా పాపులర్ ఐఫోన్లు వెంటనే కొనేస్తారు. మీకు ఐఫోన్ 16ప్రో కొనుగోలుపై ఆసక్తి ఉంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,09,500కు అందుబాటులో ఉంది. అదనంగా, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4,500 డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. 2000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రో హ్యాండ్‌సెట్ ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.

Read Also : Samsung Galaxy A36 5G : అదిరిపోయే డిస్కౌంట్.. భారీగా తగ్గిన శాంసంగ్ 5G ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రోలో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్ట్‌తో 3582mAh బ్యాటరీతో వస్తుంది.